వడగండ్లు ఎలా ఏర్పడతాయి ? అవి వర్షాకాలం వానల్లో కనిపించవేమి?
సాధారణం గా తుఫాను పరిస్థితి లున్నప్పుడే వడగండ్లు కురుస్తాయి . వేసవి కాలం లో ఎండల వలన సముద్రపు నీరు ఆవిరై మేఘాలు గా మారుతాయి . ఇవి తిరుగాడే వాతావరణ పొరలో ఉష్ణోగ్రత దాదాపు సున్నా డిగ్రీల సెంటిగ్రేడు వరకు ఉంటుంది . ఆ పై ప్రాంతం లో ఉష్ణోగ్రత ఇంకా తక్కువగా మైనస్ డిగ్రీలలో ఉంటుంది . ఇలాంటి సమయాల్లో వేగంగా వీచే తుపనుగాలులు మేఘాలను వాతావరణం లో పై పొరకు నేట్టివేస్తాయి . అక్కడ ఉష్ణోగ్రత చాలతక్కువగా ఉండడం వల్ల మేఘాల్లోని నీటి బిందువులు ఘనేభవించి వడగండ్లుగా మారుతాయి . ఇవి తమ చుట్టుప్రక్కల ఉండే నీటి బిందువుల్ని , సూక్శ్మ మంచు బిందువులను కలిపేసుకుని క్రమేణా భారాన్ని పెంచుకుంటాయి. చివరికి వీటిపై పనిచేసే భూమ్యాకర్షణ బలము అక్కడి గాలుల నిరోధక బలం కన్నా ఎక్కువ కాగానే అవి స్వేశ్చేగా భూమి మీదకు కురుస్తాయి .
వానాకాలము లో భూమి వాతావరణ పొరల్లో ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఎక్కువగా ఉండవు కాబట్టి తక్కువ ఎత్తులోనే మేఘాల్లోని నీటి ఆవిరి బిందువులుగా మారి వర్షంలా కురవడం వల్ల వడగండ్లు ఏర్పడవు .