Sunday, March 05, 2017

Peacock tears drinking by peahen?,మగ నెమలి కన్నీరు తాగితేనే ఆడ నెమలి గుడ్లు పెడుతుందంటారు. నిజమేనా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  • ప్రశ్న: మగ నెమలి కన్నీరు తాగితేనే ఆడ నెమలి గుడ్లు పెడుతుందంటారు. నిజమేనా?



  • జవాబు: సాధారణ ప్రజానీకంలో జంతువుల గురించి ఉన్న అపోహలో ఇది కూడా ఒకటి. పాము పాలు తాగుతుందనుకోవటం, పాము నాగస్వరానికి నాట్యమాడుతుందని అనుకోవటం, పిల్లి ఎదురొస్తే అనుకోని ఆపదలు కలుగుతాయనుకోవడం వంటి అపోహలు ప్రజల్లో ఉన్నాయి. నెమలికయినా, మరే జీవికయినా కన్నీటిలో జీవకణాలు ఉండవు. నెమలి, కోతి, కప్ప, పాము, మనిషి, ఆవులు, గేదెలు వంటి ద్విలింగ జీవులలో పురుష జీవి నుంచి సగం క్రోమోజోములున్న శుక్రకణం, ఆడ జీవిలో సగం క్రోమోజోములున్న అండంతో ఫలదీకరణం (ఫెర్టిలైజేషన్‌) జరిగాక సంయుక్త బీజకణం (జైగోట్‌) ఏర్పడుతుంది. ఇదే మనుషుల్లో శిశువుగా, పక్షుల్లో గుడ్డుగా మారుతుంది. విసనకర్రల్లాగా అందమైన ఈకలను విప్పారించేది మగ నెమలి. దాని కన్నీరును ఆడ నెమలి తాగదు. అలా తాగితేనే గుడ్లు పెడుతుందనటంలో నిజం లేదు.

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-