Saturday, April 30, 2011

Who were real devotees in Hindu puranas, హిందూ పురాణాలలో స్వచ్చమైన భక్తులెవరు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

హిందూ పురాణాలలో భక్తులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి ->
  • ప్రహ్లాద ,
  • నారద ,
  • పరాశర ,
  • పుంరీకాదులు ,
  • భీష్మ ,
  • శుక ,శుకాదులు ,
  • శ్రీ రామకృష్న పరమహంస ,
  • రమణ మహర్షి ,
  • బధ్రాచల రామదాసు ,
  • త్యాగయ్య ,
  • కుంతి,
  • కుబ్జ ,
  • ద్రౌపతి ,
సకల మానవాళికీ పరమాత్మ ఒక్కరే అయినా , ఆయనను అనేక రూపలలో ఆరాధిస్తారు .

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నవ్వు నాలుగు విధాల చేటు అంటే ఏమిటి ? , What do we say Laugh is bad by 4 ways?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ఫ్ర :నవ్వు నాలుగు విధాల చేటు అంటే ఏమిటి ? .

జ : నవ్వకూడని సందర్భాలు , నవ్వే సందర్భాలూ చూసుకొని నవ్వాలని దాని పరమార్ధము .
  1. ఆవేదనతో తనకు జరిగిన అవమానాన్ని పంచుకుంటున్నప్పుడు నవ్వకూడదు .
  2. అన్నిరకాలుగా ఓడిపోయినవాడిని , అవమానభారముతో వెళ్ళిపోతున్న వాడిని చూసి నవ్వకూడదు .
  3. ముఖపరిచమున్న స్త్రీని చూసి పురుషుడు పలకరింపుగానే నవ్వాలిగాని అతిగా నవ్వకూడదు . వివాహమైన పరస్త్రీ , పరపురుషులు ...ఒకరితో నొకరు నవ్వులాటలాడుకోకూడదు . . అది పురుషుని కన్న స్త్రీ కే అవమానము తెచ్చిపెడుతుంది .
  4. గురువులవద్దా , పూజాదికాలసమయాలలో అధికంగాను , గట్టిగాను నవ్వకూడదు ...చిరునవ్వుతోనే పలుకరించుకోవాలి .

  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, April 28, 2011

కంప్యూటర్ల వాడడం వల్ల పిల్లల మెదడు పై ప్రభావము , Effects of Computer Use on Children brain

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసు
కుందాం !.

ప్ర : పిల్లలు ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చోవడంవల్ల వారి మెదడు ఎలా ప్రభావితం అవుతుంది ?.

జ : ప్రాధమిక పాఠశాలకు వెళ్ళే పిల్లలు సగటున ఒక గంట -ఇరవై నిముషాలు కంప్యూటర్ల పై గడుపుతున్నారని పరిశోధనలు పేర్కొంటున్నయి. నిద్ర పోయే ముందు ఒక గంట ముందుగా కంప్యూటర్ల ముందు కూర్చోవడంవల్ల వారి మెదడు ఎక్కువగా ప్రభావితం అవుతుందని నిపుణులు చెప్తున్నారు . ఏ వయసు పిల్లలు ఎంతసేపు ఆన్‌లైన్‌ లో ఉండవచ్చుననేది ఒక్కోదేశం ఒక్కోరకంగా లెక్కలు చెప్తుంది . అయితె 11 యేళ్ళ వయసులోపు పిల్లలు రెండు గంటలు మించి కంప్యూటర్ల్ స్క్రీన్‌ ముందు కూర్చున్నట్లైతే మానసిక సమస్యల రిస్కు 60 శాతము కంటే ఎక్కువ ఉంటుందని బ్రిటన్‌ లో జరిగిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సంతోషము గా లేని పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్‌ చూడడానికి ఇష్టపడుతున్నారని పరిశోధకులు తెలుపుతున్నారు . అది పిల్లల ఎటెన్షన్‌ ను దెబ్బతీస్తుందని , ప్లానింగ్ , ఎటెన్షన్‌ , స్వయంనియంత్రణ లకు మెదడులో బాధ్యత వహించే కార్టెక్స్ దెబ్బతింటుందని వివిరించారు శాస్త్రజ్ఞులు. 2 గంటలు మించి కంప్యూటర్ గేమ్‌స్ ఆడినా , టెలివిజన్‌ చూసినా వారిలో ఎటెన్షన్‌ సమస్యలు రెండింతలు పెరుగుతాయి.

దీంతో కొందరిలో దుష్ఫ్రభావాలూ తలెత్తే అవకాశమూ ఉంది. వాటిల్లో కొన్ని..
* మణికట్టు వద్ద కండరాల నొప్పి
* మెడనొప్పి
* కుంగుబాటు
* భావోద్రేకాల్లో మార్పులు
* గేమ్‌లను ఆడొద్దంటే కోపంతో రెచ్చిపోవటం
* కుటుంబంలో, బయటా జరితే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం
* స్నేహితులతో చనువుగా మెలగకపోవటం
* భోజనం కూడా తమ గదిలోనే కానిచ్చేయటం
* హోంవర్క్‌ పూర్తి చేయకపోవటం
* తరగతుల్లో పాఠాల పట్ల శ్రద్ధ చూపకపోవటం

కంప్యూటర్‌ గేమ్‌ల్లో మునిగిపోయిన పిల్లలు నలుగురిలోకి రావటానికి సిగ్గుపడుతున్నా, ఆందోళనతో కనిపిస్తున్నా ముప్పు పొంచి ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఇవి వారి మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే కంప్యూటర్‌ గేమ్‌లకు పిల్లలు ఎక్కువగా అతుక్కుపోతున్నట్టు గమనిస్తే వాటి నుంచి దృష్టి మళ్లించటానికి వెంటనే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* ఇలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువసేపు మాట్లాడుతుండాలి.
* కంప్యూటర్‌ వాడకంలో ముందే పరిమితి విధించాలి.
* అందరూ తిరిగే ప్రాంతంలోనే కంప్యూటర్‌ను ఉంచాలి.
* అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారన్నదీ గమనిస్తుండాలి.
* కొన్నిసార్లు పిల్లలు ఆడే ఆటల్లో పాలుపంచుకోవటమూ మంచిదే.
* పిల్లలతో కలిసి తరచూ షికార్లకు వెళ్తుండాలి.

--- డా.వందన శేషగిరిరావు -శ్రీకాకుళం .

  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, April 23, 2011

కొన్ని కరంటు తీగలకే షాకేల?, Why do only some electric wires give shock?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: కొన్ని కరెంటు వైర్లు షాక్‌ కొడతాయి కానీ, కొన్ని కొట్టవు. ఎందుకని?

-బి. రణధీర్‌, ధర్మారం

జవాబు: కరెంట్‌ షాక్‌ కొట్టాలంటే ఆ తీగలో తగినంత మోతాదులో విద్యుత్‌ పొటన్షియల్‌ ఉండాలి. అలాగే విద్యుత్‌ ప్రవాహ వలయంలో మన శరీరం కూడా ఒక భాగమై ఉండాలి. శరీరానికి అటూ ఇటూ ఉన్న బిందువుల మధ్య పొటెన్షియన్‌ భేదం బాగా ఉండాలి. మన ఇళ్లలోకి వచ్చే సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ తీగకూ, నేలకూ మధ్య సుమారు 240 పొటెన్షియల్‌ ఉంటుంది. ఇలాంటి తీగను ఒక చేత్తో పట్టుకుని నేల మీద కాళ్లు ఆనిస్తే ప్రాణాపాయం కలిగే షాక్‌ తగులుతుంది. అమెరికా, జపాన్‌ లాంటి దేశాల్లో సింగిల్‌ ఫేజ్‌ తీగకూ, నేలకూ మధ్య పొటన్షియల్‌ తేడా కేవలం 115 వోల్టులే ఉంటుంది. అందువల్ల షాక్‌ తగిలినా ప్రాణాపాయం ఉండకపోవచ్చు. ఇక బస్సులు, రైళ్లు, కార్లలో ఏర్పాటు చేసే తీగల్లో బాగా తక్కువ వోల్టేజి ఉంటుంది. వాటిని పట్టుకుంటే జిల్‌మన్నట్టు ఉంటుంది కానీ అపాయం ఉండదు. సాధారణ టార్చిలైటులో బ్యాటరీలకు, బల్బుకు కలిపే తీగల వోల్టేజి 10 లేదా 12 వోల్టులకు మించదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, April 11, 2011

నాగమణులు ఉన్నాయంటారు నిజమేనా?,Is there onyx on the hood of a cobra?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: నాగు పాముల విషం కాలక్రమేణా మణిగా మారుతుందని చెబుతారు, నిజమేనా?
-పి. లతామంగేష్కర్‌, ప్రొద్దుటూరు (కడప)

జవాబు: పాములు మణులను సృష్టించలేవు. నాగమణులంటూ ఎక్కడా లేవు. పాములు విషం గట్టిపడి అదే మణిగా మారుతుందనడం కూడా నిజం కాదు. పాములకు సంబంధించినన్ని మూఢనమ్మకాలు ఇన్నీ అన్నీ కావు. పాములు పగపడతాయని అనుకుంటారు. అది తప్పు. పాములు నాగస్వరాన్ని వింటూ ఆడతాయంటారు. ఇదీ నిజం కాదు. పాములకు చెవులు లేవు. పాములు పాలు తాగడం కూడా నిజం కాదు. అలాగే జర్రిపోతు మగపామే కానక్కర లేదు. అలాగే పాములన్నీ విషపూరితం కూడా కావు.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ===============================
visit My website ->Dr.Seshagirirao - MBBS.

Saturday, April 09, 2011

రుచికి, వాసనకు మధ్య సంబంధం ఏమైనా ఉందా?,Is there any relation between Taste and Smell?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: రుచికి, వాసనకు మధ్య సంబంధం ఏమైనా ఉందా?

-కె. పవన్‌కుమార్‌, 8వ తరగతి, వరంగల్‌

జవాబు: మనం ఏదైనా ఆహారాన్ని తినేప్పుడు కానీ, ఏదైనా పానీయాన్ని తాగేప్పుడు కానీ రుచి, వాసనలు తెలుస్తాయి. వీటిని గుర్తించడంలో నోటిలోని నాలుక పాత్ర కన్నా, ముక్కు ప్రమేయమే ఎక్కువగా ఉంటుంది.వాసన, రుచులను మనం పూర్తిగా ఆస్వాదించడానికి కారణం ముక్కులోని శ్లేష్మం పొర (మ్యూకస్‌ మెంబ్రేన్‌)లో ఉండే ఘ్రాణేంద్రియ కణాలే. నోటిలో, గొంతులో ముఖ్యంగా నాలుకపై జ్ఞానేంద్రియ కణాలు ఉన్నా, ఇవి తీపి, పులుపు, ఉప్పు, చేదులాంటి కొన్ని రుచులకే ప్రతిస్పందిస్తాయి. మనం తినే, తాగే పదార్థాల అణువులు ముక్కులోని ఘ్రాణేంద్రియ కణాలను చేరుకుంటాయి. ఇవెంత సున్నితమైనవంటే వేలాది వాసనల మధ్య తేడాలను చటుక్కున కనిపెట్టగలవు. ఈ కణాల నుంచి సంకేతాలను బట్టే ఎక్కువగా మన మెదడు ఆయా రుచులను పసిగట్టగలదు. దేన్నయినా తినేప్పుడు ముక్కు మూసుకుని దాని రుచిని తెలుసుకోడానికి ప్రయత్నిస్తే ఈ విషయం సులువుగా అర్థం అవుతుంది.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, April 07, 2011

గాలితో కారు నడిచేదెలా?,How do a car run by air?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: కేవలం గాలిని ఉపయోగించి కారుని నడిపారని పత్రికల్లో చదివాను. ఇదెలా సాధ్యం?

జవాబు: సాధారణంగా వాహనాలు పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాలలోని రసాయనిక శక్తిని తమ అంతర్దహన యంత్రాంగం (internal combustion mechanism) ద్వారా యాంత్రిక శక్తిగా మార్చుకుని పని చేస్తాయి. ఈమధ్య వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ యాంత్రిక పద్ధతుల్లో వాహనాలను నడిపే ప్రక్రియలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటివే ఈ వాయు చోదక వాహనాలు. మామూలు గాలిని ప్రత్యేక మోటార్ల ద్వారా సిలండర్లలో అధిక పీడనంతో నింపుతారు. వీటి మూతులకు ప్రత్యేకమైన రెగ్యులేటర్లను అమర్చడం ద్వారా కావలసిన పీడనం, వేగాలతో బయటకి పంపే ఏర్పాటు ఉంటుంది. ఇలా అత్యధిక ఒత్తిడితో బయటకి వచ్చే గాలి టర్బైన్‌ను తిప్పే విధంగా అమరిక ఉంటుంది. అంటే వాయుశక్తి యాంత్రిక శక్తిగా మారుతోందన్నమాట. ఈ టర్బైన్‌కు అనుసంధానంగా చక్రాల ఇరుసులను అమర్చడం వల్ల అవి తిరిగి కారు ముందుకు కదులుతుంది. ఇలాంటి ఇంజిన్లను వాయుచలన యంత్రాలు (Pneumatic engines) అంటారు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక

  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

భారీ ఎలుగుబంటి సంగతేమిటి?,What about this big bear?

  • image : courtesy with Eenadu news paper hai bujji..
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

11 అడుగుల పొడవు... 1700 కిలోల బరువు... ఈ కొలతలు ఏ ఏనుగువో కావు... ఒక ఎలుగుబంటివి... వివరాలేంటో చూద్దామా!

కుక్కంత ఉండే ఎలుగుబంట్లు తెలుసు, మనిషంత ఉండేవి తెలుసు. మరి ఏకంగా ఏనుగంత ఉండేవి చూశారా? అలాంటి ఎలుగుబంటి గురించే ఇప్పుడు కొత్తగా బయటపడింది. ఇది రెండు కాళ్లపైనా మనిషిలా నిలుచుంటే ఎంత ఎత్తు ఉంటుందనుకుంటున్నారు? సుమారు ఏనుగంత. అమ్మో అని భయపడకండి. ఇప్పుడివి లేవు. ఎప్పుడో అంతరించిపోయాయి. అయినా కోట్ల ఏళ్ల క్రితం ఈ భూమిపై తిరిగిన ఓ ఎలుగుబంటి గురించి మనకెలా తెలిసింది? ఆ ఎలుగుబంటి శిలాజాల వల్ల.

సుమారు 76 ఏళ్ల క్రితం 1935లో అర్జెంటీనాలో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. అక్కడ పునాది కోసం తవ్వుతుంటే ఓ జంతువుకి సంబంధించిన అస్థిపంజరం బయటపడింది. దానిని ఆ ఆసుపత్రి యాజమాన్యం దగ్గర్లో ఉన్న మ్యూజియం వాళ్లకి ఇచ్చేశారు. శాస్త్రవేత్తలు ఇదేదో ఎలుగుబంటికి చెందినదై ఉంటుందని తేల్చి వదిలేశారు. తరువాత చాలా ఏళ్ల వరకు దాన్నెవరూ పట్టించుకోలేదు. ఇటీవలే కొందరు జీవశాస్త్రవేత్తలు మళ్లీ ఆ శిలాజాన్ని తీసి పరిశోధనలు చేశారు. అందులో బోలెడు కొత్త విషయాలు తెలిసాయి.

శిలాజాన్ని బట్టి ఈ ఎలుగుబంటి సుమారు 20 లక్షల ఏళ్ల నుంచి 5 లక్షల ఏళ్ల మధ్యలో జీవించిన జాతిదని తేలింది. 'సౌత్‌ అమెరికన్‌ జెయింట్‌ షార్ట్‌ ఫేస్డ్‌ బియర్‌' అని పేరు పెట్టారు. అంటే మనం దీనిని 'పొట్టి ముఖం ఎలుగుబంటి' అని పిలుచుకోవచ్చు. దొరికిన ఎముకల్ని బట్టి అంచనా వేస్తే ఇది నిలువుగా నిలుచుంటే సుమారు 11 అడుగుల ఎత్తు ఉంటుందని తెలిసింది. అంతేకాదు బరువు కూడా 1700 కిలోలకు పైమాటే. ఆ కాలంలో భూమి మీద ఉన్న జంతువుల్లో భారీ, శక్తివంతమైన జంతువుల్లో ఇదీ ఒకటి. వేరే జంతువు వేటాడి తెచ్చుకున్న ఆహారం కోసం ఇది ఆ జంతువుతో పోరాటాలకు దిగేదట. అందుకే దీనికి చనిపోయే ముందు ఒంటి నిండా దెబ్బలే ఉండి ఉంటాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు.

* ప్రపంచంలో మొత్తం 8 ఎలుగు జాతులు ఉన్నాయి.
* ప్రస్తుతం అతిపెద్దది ధ్రువపు ఎలుగుబంటి. దీని బరువు వెయ్యి కిలోగ్రాములు
* ఎలుగుబంట్లు సుమారు రెండు కోట్ల ఏళ్ల క్రితం నుంచి భూమిపై ఉన్నట్లు తెలుస్తోంది.

source : Eenadu News paper... hai bujji
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, April 06, 2011

వృత్తాన్ని ఎందుకు 360 డిగ్రీలుగా విభజించారు?,Why do circle divided as 360 degrees?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: వృత్తాన్ని ఎందుకు 360 డిగ్రీలుగా విభజించారు?

-కె. రమణారావు, 10వ తరగతి, కోరుకొండ

జవాబు: ప్రస్తుత కాలంలో మనం దశాంశ పద్ధతి (Decimal System)ను వాడుతున్నట్టే, బాబిలోనియన్లు 3000 సంవత్సరాల క్రితం షష్టిగుణక పద్ధతి (hexagesimal system)ను అనుసరించేవారు. ఈ పద్ధతిలో గణిత సంబంధిత సంఖ్యలన్నీ 6 చేత గుణించబడి ఉండాలి. ఆ ప్రకారం సంవత్సర కాలాన్ని 360 రోజులుగా, రోజును 24 గంటలుగా, రోజులోని గంటను 60 నిమిషాలుగా, నిమిషాన్ని 60 సెకన్లుగా, నెలను 30 రోజులుగా, సంవత్సరాన్ని 12 నెలలుగా విభజించారు. రాశి చక్రం సంజ్ఞలు కూడా పన్నెండే. ఇవన్నీ 6 గుణకాలే.

బాబిలోనియన్ల అంచనా ప్రకారం భూమి, గ్రహమండలం (zodiac)గుండా 360 రోజులు వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అందువల్ల వృత్తాకారాన్ని 360 భాగాలుగా విభజించారు. ఒక్కో భాగం ఒక డిగ్రీ. అంటే భూమి గ్రహమండలంలో ఒక రోజుకు ఒక డిగ్రీ వంతున పరిభ్రమిస్తుంది. 60X6=360 కాబట్టి ఒకో డిగ్రీని 60 భాగాలుగా (ఒకో భాగం మినిట్‌), ఒక మినిట్‌ను 60 భాగాలుగా (ఒకో భాగం సెకండు)గా విభజించారు. త్రికోణమితిలో తరచూ ఉపయోగించే కోణీయ రూపకాలైన డిగ్రీలన్నీ ఆరు గుణకాలే. ప్రాథమిక భౌతిక రాశులైన పొడవు, ద్రవ్యరాశులు చాలా కాలం కిందటే దశాంశ పద్ధతి (మెట్రిక్‌)లోకి మార్పు చెందినా, ఇప్పటికీ కాలం (టైమ్‌) కొలతలు మాత్రం షష్టిగుణక పద్ధతిలోనే కొనసాగుతున్నాయి.

-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, April 04, 2011

ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం ఏది?,Where is the Biggest Library in the world?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ఫ్ర : ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం ఏది?,ఎక్కడ,Where is the Biggest Library in the world?

జ :
పది కోట్ల పుస్తకాల గ్రంథాలయం 211 ఏళ్ల చరిత్ర... 10 కోట్ల పుస్తకాలు... 3 వేల మందికి పైగా సిబ్బంది... అన్నీ కలిస్తే... ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం!

మీరు అప్పుడప్పుడు గ్రంథాలయానికెళ్లి పుస్తకాలు చదువుకుంటారుగా? మరైతే ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఎక్కడుందో తెలుసా? అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌ డీసీలో. అమెరికా ప్రభుత్వం దీన్ని కేవలం 5000 డాలర్లతో 1800లో ప్రారంభించింది. అంటే దీనికి ఏకంగా 211 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌గా పిలిచే దీంట్లో మొత్తం 14 కోట్ల వస్తువులు ఉన్నాయి. అంటే పుస్తకాలతోపాటు సీడీలు, పురాతన పత్రాలు, మ్యాపులూ, వీడియోలు ఇలాంటివన్నమాట. కేవలం పుస్తకాల సంఖ్యే 10,90,29,769. ఈ పుస్తకాలన్నీ ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయో తెలుసా? వీటిని పేర్చిన అరలన్నీ కలిపితే 1046 కిలోమీటర్ల పొడవుంటాయి. గ్రంథాలయం నిర్వహణకు 3,597 మంది సిబ్బంది పనిచేస్తారు. అతి పెద్ద లైబ్రరీగా గిన్నిస్‌ రికార్డు కూడా పొందిన దీనికి www.loc.gov అనే వెబ్‌సైట్‌ ఉంది.

దీన్ని ప్రారంభించి పన్నెండేళ్లయిందో లేదో అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు దీంట్లోని విలువైన పుస్తకాలను ఎత్తుకెళ్లి గ్రంథాలయానికి నిప్పుబెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్‌ జెఫర్‌సన్‌ తాను సేకరించిన 6000 పుస్తకాలతో మళ్లీ దీన్ని ప్రారంభించారు. తర్వాత క్రమంగా పుస్తకాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడిది అత్యాధునిక సౌకర్యాలతో, కంప్యూటర్‌ పరిజ్ఞానంతో మూడు విశాలమైన భవనాల్లో కొలువుదీరింది.
అన్ని రంగాల సమాచారాలతో సిద్ధంగా ఉండే ఇది అమెరికా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. అమెరికా కాపీరైట్‌ సంస్థగా కూడా పనిచేస్తుంది. ఎలాంటి సమచారం కావాలన్నా క్షణాల్లో దొరుకుతుంది. విభిన్న రంగాల పరిశోధనలకు కావాల్సిన విలువైన సమాచారం లభిస్తుంది. ప్రభుత్వానికి సమాచారం అందించే సంస్థగా కూడా పనిచేస్తుంది.

మీకు తెలుసా?
* 470 భాషల పుస్తకాలు ఈ లైబ్రరీలో ఉన్నాయి.
* 526,378 కాపీరైట్‌లు నమోదయ్యాయి.
* పాఠకుల కోసం 20 విశాలమైన గదులున్నాయి.
* సదస్సుల నిర్వహణకు అయిదు వేదికలు ఉన్నాయి.
* సినిమా ప్రదర్శనల కోసం ఒక థియేటర్‌ ఉంది

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, April 03, 2011

కొన్ని పదార్థాలకు వాసన ఎలా అబ్బుతుంది?,How do some substances get smell?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.్

ప్రశ్న: కొన్ని పదార్థాలకు వాసన ఎలా అబ్బుతుంది?

-ఎమ్‌. నిఖిల్‌, హన్మకొండ

జవాబు: పదార్థాలు వివిధ భౌతిక, రసాయనిక స్థితుల్లో ఉంటాయి. ఘన, ద్రవ, వాయు స్థితులతో పాటు, రసాయనికంగా రకరకాల అణునిర్మాణాలతో ఉంటాయి. వాసన వచ్చే పదార్థాలకు ఆవిరయ్యే లక్షణం ఉంటుంది. అవి ఘన రూపంలో ఉన్నా, ద్రవ రూపంలో ఉన్నా ఎంతోకొంత మేరకు సాధారణ ఉష్ణోగ్రతల వద్దే ఆవిరవుతూ ఉంటాయి. ఆ ఆవిరిలో వాటి అణువులు ఉంటాయి. ఇవి మన నాసికా రంధ్రాలను చేరినప్పుడు మన ముక్కులోపలి తడిపొరల మీద ఉన్న ఘ్రాణ నాడులు ప్రేరేపితమవుతాయి. అందుకనే వీటిని రసాయనిక గ్రాహకాలు అని కూడా అంటారు. ఇలా వివిధ పదార్థాల ఆవిరులలో వేర్వేరు అణువులు ఉండడం వల్ల ముక్కులోని నాడుల మీద వీటి ప్రభావం వాటి విలక్షణతతో ఉంటుంది. వీటి వల్ల ప్రేరేపితమయ్యే నాడులు ఆయా విశిష్ట సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి. వాటిని బట్టి మనం వేర్వేరు వాసనలను గుర్తించగలుగుతాం.

-ప్రొ|| ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, April 01, 2011

ఫ్యూజ్‌ ఎందుకుండాలి?,Why do we fuse in Electric current?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: అప్పుడప్పుడు ఫ్యూజ్‌ పోయి విద్యుత్‌ ఆగిపోతూ ఉంటుంది కదా? అసలు ఇది ఎందుకు ఉండాలి?

-కె. ఉషారాణి, విజయనగరం

జవాబు: విద్యుత్‌తో పనిచేసే రిఫ్రిజిరేటర్‌, టీవీ, ఏసీలాంటి పరికరాల గుండా విద్యుత్‌ ప్రవాహం తీవ్రత ఎక్కువైతే అవి పాడయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకోసారి ఇళ్లలో అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. ఇలా జరగకుండా నిరోధించడానికి ఏర్పాటు చేసేవే ఫ్యూజ్‌లు. విద్యుత్‌ సరఫరా కేంద్రం నుంచి మన ఇంటిలోపలి వరకూ వివిధ దశల్లో వీటిని అమరుస్తారు. విద్యుత్‌ ప్రవాహం అవసరానికి మించి ఎక్కువగా సరఫరా అయ్యే సందర్భాలలో ఫ్యూజ్‌లలో అమర్చే తీగ చటుక్కున కరిగిపోయి విద్యుత్‌ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. సాధారణంగా ఫ్యూజ్‌ తీగలను కొన్ని లోహాల మిశ్రమంతో చేస్తారు. దీని ద్రవీభవన స్థానం (melting point) తక్కువగా ఉంటుంది కాబట్టి, విద్యుత్‌ ప్రవాహ తీవ్రత పెరిగినప్పుడు ఫ్యూజ్‌ తీగ వేడెక్కి కరిగిపోతుంది. అందువల్ల విద్యుత్‌ ప్రవాహం ఆగిపోయి ప్రమాదాలు తప్పుతాయి. చాలా మంది ఫ్యూజ్‌ తరచు పోకుండా ఉండడానికి అందులో రాగి తీగలను మెలిపెట్టి వాడుతుంటారు. ఇది ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే కాగలదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

షాంపూ తో నురగ ఎలా వస్తుంది ? , What makes shampoo to give bubbles?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : షాంపూ తో నురగ ఎలా వస్తుంది ?

జ : కొంచము షాంపూ తలమీద వేసి రుద్దగానే బోలెడు నురగ వస్తుంది . నురగ అనేక సూక్ష్మ సబ్బుబుడగల సంయుక్త రూపము . షాంపూ తయారిలో వాడేది సబ్బు వంటి పదార్ధమే . దీనికి సులభము గా నీటిలో కరిగేటటువంటి గుణము ఉంటుంది . అటువంటి షంపూకు నీటిని కలిపి తలమీద రుద్దకోగానే బుడగలు ఏర్పడతాయి. తలపై ఉన్న వెంట్రుకల మధ్య గాలి ఉంటుంది . ఆ గాలితో కలిసినప్పుడు ఈ బుడగలు మరింత పెద్దవి అవుతాయి. . . అప్పుడే నురగ వస్తుంది .
  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.