Saturday, January 30, 2010

స్టెబిలైజర్‌ చేసే పనేంటి?, Work of Stebilizer?





ప్రశ్న: వోల్టేజ్‌ స్టెబిలైజర్‌ను ఎందుకు వాడాలి? అది ఎలా పనిచేస్తుంది?

జవాబు: ఇంట్లో వాడే టీవీ, రిఫ్రిజిరేటర్‌, ఏసీ లాంటి విద్యుత్‌ పరికరాలకు సరఫరా అయ్యే విద్యుచ్ఛక్తి స్థిరమైన ఓల్టేజిలో ఉండాలి. విద్యుత్‌ శాఖ నుంచి ఇంటికి సరఫరా అయ్యే విద్యుత్‌ 250 ఓల్టులు ఉండాల్సి ఉండగా ఒకోసారి హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. ఓల్టేజి తగ్గితే పరికరాలు పనిచేయవు. ఎక్కువైతే కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయా పరికరాలకు సరఫరా అయ్యే విద్యుత్‌ నిర్దిష్టంగా అందేలా చూసే పరికరం అవసరమైంది. అదే ఓల్టేజి స్టెబిలైజర్‌. దీని ద్వారానే ఆయా పరికరాలకు విద్యుత్‌ అందే ఏర్పాటు ఉంటుంది. ఇందులో ఉండే ట్రాన్సిస్టర్‌ అనే పరికరం విద్యున్నిరోధానికి అనుసంధానమై ఉంటుంది. ఈ ఏర్పాటు వల్ల సరిగ్గా పరికరానికి కావలసినంత మేరకే విద్యుత్‌ను స్టెబిలైజర్‌ నియంత్రించి పంపుతుంది. స్టెబిలైజర్‌లో వాడే ట్రాన్సిస్టర్‌ను జెనర్‌ డయోడ్‌ లేదా అవలాంచ్‌ డయోడ్‌ అంటారు.




  • ==========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

జంతువులు పళ్లు తోమక్కర్లేదా?,Animals have no need to brush teeth?





ప్రశ్న: మనిషి తప్ప మిగతా జంతువులేవీ బ్రష్‌ చేసుకోవు కదా? మరి వాటి పళ్లు పాడవకుండా ఎలా ఉంటాయి?

జవాబు: కేవలం ఆధునిక మానవుడు మాత్రమే పళ్లు తోముకుంటున్నాడు. నాగరికత నేర్చిన మానవుడు పళ్లు తోముకోడానికి కేవలం సూక్ష్మక్రిముల నిర్మూలనే కారణం కాదు. ఇది సౌందర్యపరమైన అంశం కూడా. సంఘజీవులైన మనుషులు చనువుగా, దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దుర్వాసన ఒక సమస్యగా మారుతుంది. పళ్ల మధ్యలో చిక్కుకున్న ఆహారపు అణువులపై సూక్ష్మక్రిములు ఏర్పడ్డం వల్ల దుర్వాసనే కాదు, దంతాలు కూడా పాడవుతాయి. ఇక మనుషులు తినేంత వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లు జంతువులకు లేవు. శాకాహార జంతువులు పీచు బాగా ఉండే ఆకులు, గడ్డి మేస్తాయి. మొక్కల రసాలు వాటి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి .చంతాల మధ్య, చిగుళ్ళ మీద సూక్ష్మజీవులు చేరకుండా వాటిని సంహరించగలిగిన రసాయనాలు జంతువులు తినే గడ్డి , ఇతర వృక్షపదార్ధాల ద్వారా సమకూరుతాయి. శాఖాహారజంతుల్వుల పళ్లు దగ్గరగా, పెద్దగా ఉంటాయి. మాంసాహార జంతువుల పళ్ల మధ్య ఎడం బాగా ఉంటుంది. జంతువుల నాలుకలు పొడవుగా, గరుకుగా ఉంటాయి. వాటితో అవి పళ్లను పదే పదే నాకుతూ శుభ్రం చేసుకోగలుగుతాయి. అలాగే వాటి లాలాజలంలోని లవణీయత, జిహ్వస్రావాల లాంటివి కూడా దంతక్షయం కాకుండా కాపాడుతాయి.

======================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

కార్డియోగ్రామ్‌ పని చేసేదెలా?,Cardiogram working-how?




ప్రశ్న: మనిషి గుండె పరిస్థితిని కనిపెట్టే కార్డియోగ్రామ్‌ ఎలా పనిచేస్తుంది?

జవాబు: కార్డియోగ్రామ్‌ పరికరాల్లో రకాలున్నాయి. సాధారణమైనది శబ్దతరంగాల సాయంతో గుండె ప్రతిబింబాన్ని తెరపై కనిపించేట్టు చేస్తుంది. ఈ పద్ధతిలో అతిధ్వని తరంగాలను (ultra sounds) గుండెపై పడేటట్టు ప్రసరింప చేసి, అక్కడి నుంచి పరావర్తనం చెందిన తరంగాలను గ్రహించే ఏర్పాటు ఉంటుంది. పరావర్తన తరంగాల ప్రతిబింబాలను ఒక తెరపై పడేటట్లు చేసి గుండె ఆకృతిని చూడగలుగుతారు. అయితే ఈ కార్డియోగ్రామ్‌ ద్వారా గుండెలో ప్రవహించే రక్త వేగాన్ని కొలవలేము. ఇందుకోసం డాప్లర్‌ ఎకో కార్డియోగ్రామ్‌ను ఉపయోగిస్తారు. ఈ పరికరం నుంచి నిర్దిష్టమైన పౌనఃపున్యం ఉండే ధ్వని తరంగాలను గుండెలోకి ప్రసరింపజేస్తారు. ఆ తరంగాలు గుండెలో చలనంలో ఉన్న రక్తకణాలపై, రక్తనాళాలపై పడి వెనుతిరిగి వస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల పౌనఃపున్యంలో తేడాలు ఏర్పడతాయి. పంపిన తరంగాలు, తిరిగి వచ్చిన తరంగాల పౌనఃపున్యాలను బట్టి గుండెలో రక్తప్రసరణ వేగం, దిశలను గ్రహించగలుగుతారు.


visit My website > Dr.Seshagirirao - MBBS.
http://dr.seshagirirao.tripod.com/

డాల్ఫిన్లు నీటిలో గాలి పీల్చలేవా?,Dolphins can not breath inside water?






ప్రశ్న: డాల్ఫిన్లు గాలి కోసం బయటకు ఎందుకు వస్తాయి? నీటిలోనే ఆక్సిజన్‌ ఉంటుంది కదా?

జవాబు: అన్ని జలచరాలకీ ఒకే రకమైన శ్వాసక్రియ ఉండదు. చేపల్లాంటి పూర్తి స్థాయి జలచరాలు తమకుండే మొప్పల్లాంటి అవయవాల సాయంతో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ను రక్తంలోకి వ్యాపనం (diffusion) చేసుకోగలవు. కప్పలు, కొన్ని రకాల ఉభయచరాలు (amphibions) గాలిలో ఉండే ఆక్సిజన్‌ను ముక్కు రంధ్రాల ద్వారా పీల్చుకోగలిగినా, చర్మపు పొరలోకి కూడా నీటిలోని ఆక్సిజన్‌ను సైతం కొంతలో కొంత సేకరించుకోగలవు. కానీ నీటిలోనే నివాసం ఉంటున్నా నీటిలోని ఆక్సిజన్‌ను గ్రహించలేని జలచరాలు కూడా ఉన్నాయి. నీటి పాములు, తాబేళ్లు, మొసళ్లు, సీల్స్‌, డాల్ఫిన్లు, తిమింగలాలు లాంటి జీవులకు మొప్పలు ఉండవు. చర్మపు నిర్మాణం కూడా నీటిలోని ఆక్సిజన్‌ను తీసుకోగల స్థితిలో ఉండదు. వాటికి ఊపిరితిత్తులు (lungs), నాసికా రంధ్రాలు (nostrils) ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్‌ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ (pulmonary respiration) మాత్రమే వీటిలో ఉంటుంది. అందువల్లనే ఇలాంటివి సముద్రంలోనే ఉన్నా పదేపదే నీటి ఉపరితలం పైకంటా వచ్చి గాలిని వదిలి, కావలసినంత గాలిని పీల్చుకుని తిరిగి నీటిలోకి వెళ్లిపోతూ ఉంటాయి.
  • ===============================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, January 29, 2010

నదులు-చెరువుల్లో కెరటాలుండవేం?, Tides not seen on lakes-Why?





ప్రశ్న: సముద్రంలోలాగా నదులు, చెరువుల్లో కెరటాలు ఎందుకు రావు?

జవాబు: ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే, ఎంత జలాశయానికి అంత కెరటాలు అనుకోవచ్చు. నదులు, చెరువులు, సరస్సుల్లో అలలుంటాయి కానీ కెరటాలు ఉండవు. నదులు ప్రవాహ రూపంలో ఉంటాయి కాబట్టి వాటిలోని అలలను మిగతా వాటితో పోల్చలేం. సముద్రాలు, సరస్సులు, చెరువుల్లో ఏర్పడే అలలు ఉష్ణశక్తి సంవహనం (thermal convection), ఉష్ణోగ్రతా దొంతరలు (temperature contours), జలగతిక నియమాల (hydrodynamics) సమష్టి ఫలితంగా ఏర్పడుతాయి. సంక్లిష్టమైన ఈ ప్రక్రియను స్థూలంగా అర్థం చేసుకుందాం.

నీరు అధమ ఉష్ణవాహకం. నేల కన్నా నీటిలో ఉష్ణప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. లోతైన సముద్రప్రాంతం, లేదా చెరువులో మధ్య భాగాలను తీసుకుంటే అక్కడ నీటి ఉష్ణోగ్రత, ఒడ్డున ఉన్న నీటి ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మధ్యలోని నీటి నుంచి, ఒడ్డున ఉండే నీటికి ప్రసారమవుతూ ఉంటుంది. ఇలా ప్రసారమయ్యే ప్రక్రియలో పైన చెప్పుకున్న నియమాల ద్వారా నీటి అడుగున అనుదైర్ఘ్య తరంగాలు (longitudinal waves) ఏర్పడుతాయి. చుట్టుపక్కల ఒత్తిడుల వ్యత్యాసాల వల్ల నీరు పైకి ఉబ్బి అలల్లా ఏర్పడుతాయి. వీటిని తిర్యక్‌ తరంగాలు (transverse waves) అంటారు. ఇవి ఆ జలాశయం లోతును బట్టి వేగాన్ని సంతరించుకుంటాయి. ఇవి ఒడ్డుకు చేరుతున్న కొద్దీ తరంగాల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఇవే పెద్ద అలలు. చెరువులు, సరస్సుల్లాంటి జలాశయాలతో పోలిస్తే, సముద్రంలో లోతు అధికం కాబట్టి ఈ అలలు క్రమేణా కెరటాలుగా మారతాయి.


ప్రశ్న: సముద్రంలో కెరటాలు విపరీతంగా ఎందుకు వస్తాయి? నదులు, వాగుల్లో అలా రావెందుకని?

జవాబు:
కొంచెం లోతైన ప్లాస్టిక్‌ పళ్లెంలో నీళ్లు పోసి నీటి ఉపరితలానికి సమాంతరంగా మెల్లగా గాలి ఊదితే, పళ్లెం అంతటా చిన్న తరంగాలు కదలడాన్ని గమనించవచ్చు. ఈ విధంగానే సముద్ర ఉపరితలంపై అలలు ఏర్పడుతాయి.
భూమి ఏర్పడిన తొలి నాళ్లలో ఖండాలన్నీ ఒకే భూభాగంగా కలిసి ఉండేవి. ఈ ఖండాలకు ఆధారమైన ఫలకాలు భూమి లోపల ఉండే అత్యధిక ఉష్ణోగ్రత వల్ల, ద్రవరూపంలో ఉన్న రాళ్ల కదలికల వల్ల ఒక దానికొకటి దూరంగా కదలసాగాయి. ఆ విధంగా భూమి ఖండాలుగా విడిపోయిన తర్వాత మధ్యలోని లోతైన అగాథాల్లో సముద్రాలు ఏర్పడ్డాయి. సముద్రంపై ఉండే విస్తారమైన నీటి ఉపరితలంపై గాలి తీవ్రంగా వీచడం వల్ల కెరటాలు ఏర్పడుతాయి. సముద్రపు నీటి ఉపరితలంపై సమాంతరంగా గాలి వీచడం వల్ల ఆ నీరు పైకి లేస్తుంది. పైకి లేచిన నీటిని భూమి గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంది. పైకి లేచిన కెరటం కిందికి పడినప్పుడు ఏర్పడే గతిజశక్తి (కైనెటిక్‌ ఎనర్జీ) వల్ల కూడా కొంత నీరు పైకి లేస్తుంది. పైకీ కిందికీ ఊగుతున్న నీటి కదలిక చుట్టుపక్కల నీటిలో కూడా వ్యాపించి కెరటాలు నిరంతరంగా ఏర్పడుతాయి. సముద్రపు లోతులలోకి వెళ్లే కొలదీ నీటి సాంద్రత ఎక్కువగా ఉండడంతో కెరటాల కదలికలకు ప్లవన శక్తి(buyoncy) కూడా తోడై, మరిన్ని కెరటాలు పుడతాయి. సముద్రంపై వీచే గాలి వేగం ఎక్కువయ్యే కొలదీ కెరటాల ఎత్తు ఎక్కువవుతుంది. అంటే నిలకడగా ఉన్న లోతైన నీటిపై గాలి వీయడం వల్ల సముద్రంలో కెరటాలు ఏర్పడుతాయి. అదే నిలకడ లేకుండా వేగంగా నీరు ప్రవహిస్తున్న నదులు, వాగుల్లో కెరటాలు అంతగా ఏర్పడే అవకాశం లేదు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ===============================

visit My website > Dr.Seshagirirao - MBBS.

సైకిల్‌తోపాటు ఒరుగుతారెందుకు?, We bend while cycling-Why?





ప్రశ్న: సైకిల్‌పై పోతున్న వ్యక్తి వక్రమార్గంలో పయనిస్తున్నప్పుడు ఒక పక్కకు ఒరుగుతాడు. ఎందుకు?

జవాబు: కదిలే వస్తువులకు సంబంధించిన న్యూటన్‌ గమన సూత్రాలు చదువుకుని ఉంటారు. వాటిలో మొదటి దాని ప్రకారం, రుజుమార్గంలో (straight path) సైకిల్‌పై పోతున్న వ్యక్తి మలుపు తిరగాలంటే ఆ సైకిల్‌పై బాహ్య బలం పనిచేయాలి. వక్రమార్గ కేంద్రం వైపు పనిచేసే ఈ బలాన్ని అపకేంద్ర బలం (centripetal force) అంటారు.

రుజుమార్గంలో పోతున్నప్పుడు సైకిల్‌తో పాటు వ్యక్తి బరువు (W) కిందికి భూమివైపు తలానికి లంబంగా పనిచేస్తుంటే న్యూటన్‌ మూడవ గమన సూత్రం ప్రకారం ఆ బరువుకు సమానమైన ప్రతిచర్య (normal reaction) 'R' అదే సరళ రేఖలో పైవైపునకు పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండు బలాలు ఒకదానినొకటి బాలెన్స్‌ చేసుకోవడం వల్ల ఇవి సైకిల్‌కు అపకేంద్ర బలాన్ని ఇవ్వలేవు. అందువల్ల సైకిల్‌ వక్ర మార్గంలో పోవడానికి కావలసిన అపకేంద్ర బలం సైకిల్‌ టైర్‌కు, నేలకు మధ్య కలిగే ఘర్షణ బలం (frictional force) ద్వారా లభిస్తుంది. దీనివల్ల సైకిల్‌ టైర్లు అరిగి పాడైపోతాయి.

అదే సైకిల్‌ తొక్కుతున్న వ్యక్తి వక్రమార్గ కేంద్రంవైపు కొంచెంగా వంగితే, ప్రతిచర్య (R) వ్యక్తితోపాటు సైకిల్‌ బరువు Wకు కొంత కోణం చేస్తుంది. ఆ ప్రతిచర్యను రెండు అంశాలుగా విభజించవచ్చు. ఒక అంశం బరువు Wని బాలెన్స్‌ చేస్తే, మరో అంశం వక్ర మార్గ కేంద్రంవైపు పనిచేసే ఘర్షణ బలంతో ప్రమేయం లేకుండా కావలసిన అపకేంద్ర బలాన్ని ఇస్తుంది. అందుకే సైకిల్‌ పై పోతున్న వ్యక్తి మలుపు తిరిగేటప్పుడు వక్రమార్గ కేంద్రంవైపు ఒరుగుతాడు. అంతేకాని అలా ఒరగడం స్త్టెల్‌కాదు.







visit My website > Dr.Seshagirirao - MBBS.
http://dr.seshagirirao.tripod.com/

పెద్ద సరస్సు రంగులు మారుస్తుంది-రహస్యం ఏమిటి?, Lake changes colors-what is the Secret?




ఒకసారి నీలం రంగు... మరోసారి ఆకుపచ్చ.. ఇంకోసారి పసుపు.. ఇలా ఆ సరస్సు ఒకోసారి ఒకోలా కనిపిస్తుంది. అదే బ్రిటిష్‌ కొలంబియాలోని స్పాటెడ్‌ లేక్‌. ఏడాది పొడవునా రంగులు మార్చే ఈ సరస్సుని చూడ్డానికి పర్యాటకులు వేలాదిగా వస్తుంటారు. ప్రపంచంలోని ప్రకృతి వింతలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ సరస్సు యూఎస్‌, కెనడా రాష్ట్రాల మధ్య ఉంది. 38 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సును చూసి ఇక్కడి ప్రాచీనులు భయపడేవారట. అదే ఇప్పుడు ఆ చుట్టుపక్కల వారు దీన్నొక పవిత్రమైన సరస్సుగా భావిస్తుంటారు.

ఇంతకీ ఇది ఇలా రంగులెలా మారుస్తుంది? ఎందుకంటే ఈ నీటిలో అత్యధిక శాతాల్లో రకరకాల ఖనిజాలు ఉన్నాయి. ఆయా ఖనిజాల శాతాన్ని బట్టి రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి. అదే వేసవిలో వెళ్లి చూస్తే మాత్రం అక్కడ చుక్క నీరు కనిపించదు. ఎండలు పెరిగే కొద్దీ నీరంతా ఇగిరిపోయి బురదంతా రకరకాల రంగుల్లో వలయాల్లాగా ఏర్పడుతుంది. ఈ వలయాల మధ్య నేలపై చక్కగా నడుచుకుంటూ వెళ్లచ్చు కూడా. ఆ సమయంలో ఏర్పడే ఖనిజాల తత్వాన్ని బట్టి ఈ వలయాలు పసుపు, నీలం, ఆకుపచ్చలాంటి రకరకాల రంగులతో ఏర్పడుతాయి.

సరస్సు నీటిలో ముఖ్యంగా మెగ్నీషియం సల్ఫేట్‌, కాల్షియం, సోడియం సల్ఫేట్‌ ఉంటాయి. వీటితో పాటు సిల్వర్‌, టిటానియం లాంటి మరో ఎనిమిది రకాల ఖనిజాలు కూడా కరిగిపోయి ఉన్నాయి. ఆయా కాలాల్లో ఈ ఖనిజాల మిశ్రమాల కారణంగానే సరస్సులో నీరు రంగులు మారుస్తూ ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఇంతలా ఖనిజాలు అధికంగా కరిగి ఉండే సరస్సు ఇదే. వేసవి కాలంలో నీరు ఇగిరిపోయినప్పుడు ఈ ఖనిజాలే స్ఫటికాల్లా గట్టిపడతాయి. అవి రకరకాల రంగుల్లో కనువిందు చేస్తాయి. అందుకే ఈ చెరువుకు స్పాటెడ్‌ లేక్‌ అని పేరు వచ్చింది.

ఇక ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఈ సరస్సంటే ఎంత ఇష్టమో. దీనిని 'కిలుక్‌' అని పిలుచుకుంటారు. ఈ నీటికి చర్మరోగాలను, అనారోగ్యాలను తగ్గించే గుణం ఉందని నమ్ముతారు. ఒంట్లో బాగోలేకపోతే ఇక్కడికి వచ్చి సరస్సులో పీకల్దాకా నుంచుంటారు. దెబ్బలు తగిలితే ఈ నీటిని తీసుకుని వెళ్లి పూసుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడి మట్టిని తవ్వించి దానిని తూర్పు కెనడా ప్రాంతంలో ఉన్న యుద్ధ సామాగ్రి తయారు చేసే పరిశ్రమలకు టన్నుల కొద్దీ తరలించారు.


  • ===============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

టీవీ దగ్గర అలా జరుగుతుందేం?, T.V.and Hair straightening





ప్రశ్న:
టీవీ తెరపై దుమ్మును గుడ్డతో తుడిచేప్పుడు మన చేతి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకని?

జవాబు:
అది స్థిర విద్యుత్‌ (static electricity) ప్రభావం. ప్రతి పదార్థంలో పరమాణువులు ఉంటాయి. వాటి కేంద్రకం (nucleus)లో ధనావేశంతో ఉండే ప్రోటాన్లు, ఏ ఆవేశం లేని న్యూట్రాన్లు కట్టగట్టుకుని ఉంటే, ఆ కేంద్రకం చుట్టూ రుణావేశం ఉండే ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒక పరమాణువులో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయో, అన్నే ఎలక్ట్రాన్లు ఉంటాయి. కేంద్రకం నుంచి దూరంగా ఉండే కక్ష్యలో తిరిగే ఎలక్ట్రాన్లపై కేంద్రకం ఆకర్షణ ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఇక టీవీ తెర విషయానికి వస్తే, దాన్ని ఏదైనా గుడ్డతో తుడిచేప్పుడు తెరమీది పరమాణువులు, గుడ్డలోని పరమాణువుల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణశక్తిని తెర పరమాణువుల బాహ్య కక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్లు గ్రహించి, తెర నుంచి విడివడి గుడ్డలో ఉండే పరమాణువుల బాహ్య కక్ష్యను చేరుకుంటాయి. ఎలక్ట్రాన్లను కోల్పోయిన తెర ఉపరితలపు పరమాణువులలో ధనావేశం ఉండే ప్రోటాన్ల సంఖ్య ఎక్కువవడంతో తెర ధన విద్యుదావేశాన్ని పొందుతుంది. ఎలక్ట్రాన్లను పొందిన గుడ్డ రుణ విద్యుదావేశాన్ని పొందుతుంది. మనం వాడే గుడ్డ స్వభావాన్ని బట్టి ఈ విద్యుదావేశాలు తారుమారు కూడా కావచ్చు. అంటే ఏదైనా రెండు పదార్థాలను ఘర్షణకు గురి చేస్తే వాటికి విద్యుదావేశం వస్తుంది. అలా ధన విద్యుదావేశం పొందిన తెర ఉపరితలం తిరిగి తన యధాస్థితిని పొందడానికి మన చేతిపై ఉండే పరమాణువుల ఉంచి ఎలక్ట్రాన్లను గ్రహించే ప్రయత్నం చేస్తుంది. అందువల్లనే చేతి మీది వెంట్రుకలు తెరవైపు లాగినట్టయి నిక్కబొడుచుకుంటాయి. గాలి నింపిన బెలూనును బాగా రుద్ది వదిలేసినా అది మన దేహానికి అంటిపెట్టుకుని ఉంటుంది. దీనికి కూడా కారణం ఇదే.


ప్రశ్న:
మనం టీవీని ఆఫ్‌ చేసిన వెంటనే తెరమీద చెయ్యి ఉంచితే, వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటాయి. ఎందుకు?

జవాబు:
టీవీ తెర నిజానికి శూన్యంతో కూడిన గోళం (vacuum tube)లో భాగం. టీవీ తెర వెనుక గాలి ఏమాత్రం ఉండదు. ఆ గోళానికి వెనుక భాగంలో ఎలక్ట్రాన్లను జనింపజేసే ఫిలమెంట్లు ఉంటాయి. అలా విడుదలైన ఎలక్ట్రాన్లు వేగంగా వచ్చి టీవీ తెర వెనుక భాగాన్ని తాకే ఏర్పాటు ఉంటుంది. అక్కడ ఫాస్ఫారిసెన్స్‌ పూత పూసిన సూక్ష్మమైన బొడిపెలపై ఎలక్ట్రాన్లు పడి నప్పుడు అవి వెలగడం వల్ల మనకు ఇవతలి వైపు నుంచి దృశ్యం కనిపిస్తుంది. అత్యధిక విద్యుత్‌ ప్రసారం వల్ల ఎంతో వేగంతో ప్రయాణిస్తూ వచ్చే ఎలక్ట్రాన్లు టీవీ తెరపై ఉండే ఎలక్ట్రాన్లను నెట్టివేస్తాయి. అందువల్ల టీవీ తెర పాక్షికంగా ధనావేశంతో స్థిర విద్యుత్‌ (static electricity)ను పొంది ఉంటుంది. టీవీ ఆఫ్‌ చేసినా ఆ విద్యుదావేశం ఇంకా కొంత ఉంటుంది. అప్పుడు మనం చేయిని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు మన వెంట్రుకల్లోని వ్యతిరేక విద్యుదావేశం ఆకర్షణకు గురవుతుంది. అందువల్లనే రోమాలు టీవీ తెరవైపు నిక్కబొడుచుకుంటాయి.
  • =================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ఊపిరితిత్తులు లేని జీవి ఏది ?, Lung less creature-Name?




భూమిపై అన్ని అవయవాలు ఉన్న జంతువులే కాదు... లేకుండా కూడా కొన్ని జీవిస్తున్నాయి. వీటికి అవయవాలు ప్రమాదవశాత్తూ తెగిపోవడం కాకుండా, పుట్టుకతోనే కొన్ని శరీర భాగాలు ఉండవన్న మాట. అలాంటి జీవినే గయానా దేశంలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి వూపిరితిత్తులు, కాళ్లు, ఆఖరికి నాసికా రంధ్రాలు కూడా లేవు. చూడటానికి వానపాములా కనిపిస్తుంది. పరిశోధకులు దీనికి కాసిలిటా ఇవోక్రమా (Caecilita Iwokramae) అని పేరు పెట్టారు.

నీటిలో శ్వాసించే లార్వాగా జీవనం మొదలై, నేలపై కూడా శ్వాసించేలా శరీరాన్ని అభివృద్ధి చేసుకోగలిగే యాంఫిబియాన్‌ (ఉభయచర) జీవుల్లో మూడు రకాలు ఉన్నాయి. ఒకటి కప్పలు, రెండు బల్లిలా కనిపించే సాలమండర్స్‌, మూడు కాసిలియన్స్‌. కొన్ని అవయవాలు లేకుండా పుట్టే జీవులు ఈ కాసిలియన్‌ జాతిలోకి వస్తాయి. ఇప్పుడు కనుక్కొన్న ఈ కొత్త జీవి కూడా ఈ కోవకే చెందింది. ప్రపంచం మొత్తంమ్మీద 120 కాసిలియన్‌ జాతులు ఉంటే వీటిలో వూపిరితిత్తుల్లేనిది ఇదొక్కటే. విచిత్రమైన విషయం ఏంటంటే నేలపైన 11 సెం.మీ. పొడవు మాత్రమే పెరిగే ఇది, నీటిలో ఏకంగా రెండు అడుగుల వరకు ఎదుగుతుంది. 2008లో వూపిరితిత్తుల్లేని ఒక కప్పని కూడా కనుగొన్నారు.

వూపిరితిత్తులు, ముక్కు రంధ్రాలు లేకుండా ఇదెలా శ్వాస తీసుకుంటోంది?వీటి చర్మంపైన కంటికి కనిపించనంత సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇవి పీల్చుకుంటాయి. అంటే చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుందన్న మాట. వీటి కంటిచూపు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని బెలగాంలో కూడా ఈ జాతికి చెందిన జీవులు ఈ మధ్యనే బయటపడ్డాయి. అసలు ఇలా కొన్ని రకాల జీవులకి ఎందుకు శరీరభాగాలు ఉండవో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వాటి జాతి పరిణామ క్రమంలో మార్పులు వల్ల కూడా ఇలా జరుగుతుందని భావిస్తున్నారు.


=====================================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

పశువులు రంగులు చూస్తాయా?, Cattles-can see colors?




ప్రశ్న: పశువులు రంగులు చూస్తాయా?

జవాబు: పశువులు రంగుల్ని చూడలేవనేది నిజమే. రంగులంటే మనం చూసే సప్తవర్ణాలు, వాటి కలయికల వల్ల ఏర్పడే ఫలిత వర్ణాలే. తెలుపు, నలుపుల్ని కూడా మనం రంగులంటాం కానీ అవి నిజానికి రంగులు కావు. ఇక పశువులు కేవలం నలుపు, తెలుపు ఛాయల్ని మాత్రమే చూడగలుగుతాయి. సినిమాల్లో ఎర్ర చీర కట్టుకున్న హీరోయిన్‌ను ఎద్దు తరిమినట్టు చూపించే దృశ్యాలన్నీ నాటకీయత కోసమే. ఎర్ర చీరయినా, పసుపు చీరయినా, ఆకుపచ్చ చీరైనా పశువులకు బూడిద (గ్రే) రంగులో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి నల్లటి దుస్తులు పశువులకు స్పష్టంగానే కనిపిస్తాయి.


===================================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ప్లాస్మా అంటే ఏమిటి?, Plasma-what is it?





ప్రశ్న: భౌతిక శాస్త్రంలో ప్లాస్మా అనే పదం వింటుంటాం. అసలు ప్లాస్మా అంటే ఏమిటి?

జవాబు: పదార్థాలు మామూలుగా ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటాయని తెలిసిందే కదా. ఈ మూడు స్థితులకీ చెందని స్థితే ప్లాస్మా. అందుకే దీన్ని నాలుగవ స్థితి పదార్థము(forth state of matter)అంటారు. పదార్థాలన్నీ పరమాణు నిర్మితాలని చదువుకుని ఉంటారు. ఏ పదార్థమైనా ఒక పరిమితికి మించి వేడి చేస్తే అది వాయువుగా మారుతుంది. ఆ వాయువుకి కూడా అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత అందితే, అందులోని పరమాణవుల నుండి ఎలక్ట్రాన్లు, కేంద్రకాలు వేరుపడిపోయి వేటికవి స్వేచ్ఛగా చలిస్తూ ఉంటాయి. ఈ స్థితే ప్లాస్మా. ప్లాస్మా అయస్కాంత క్షేత్రాల వల్ల ప్రభావితం అవుతుంది. దీని నుంచి విద్యుత్‌ కూడా ప్రవహిస్తుంది. సూర్యుడు, నక్షత్రాలన్నింటిలో ద్రవ్యం ప్లాస్మా రూపంలోనే ఉంటుంది. అంతేకాదు మన భూమి వాతావరణంలో పైపొర అణుశకలావరణం (ionosphere)లో ఉండేది కూడా ప్లాస్మానే. లోహాల వెల్డింగ్‌కు ఉపయోగించే ఎలక్ట్రిక్‌ స్పార్క్‌లలో, విద్యుత్‌ ఉత్సర్గ దీపాల(electric discharge lamps)లో ఉండేది కూడా ప్లాస్మానే. ప్లాస్మాలో విడివిడిగా ఉండే ఎలక్ట్రాన్లు, ధనావేశమున్న కేంద్రకాలు ఆకర్షణకు లోనై ఒకటిగా కలిసిపోకపోవడానికి కారణం అక్కడ ఉండే ఉష్ణశక్తి, వాటిని అత్యంత వేగంతో చలించేలా చేయడమే. పైగా అక్కడ సాంద్రత అతి తక్కువగా ఉండడం వల్ల ప్లాస్మాలోని కణాల మధ్య దూరం ఎక్కువగా ఉండి, అవి ఆకర్షించుకునే అవకాశం చాలా తక్కువ.

====================================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

కుండకి- ఫ్రిజ్‌కి తేడా ఏంటి?, Pot and Fridge-Difference







ప్రశ్న: కుండలోని నీరు చల్లబడడానికి, ఫ్రిజ్‌లోని నీరు చల్లబడడానికి ఉన్న తేడా ఏంటి?

జవాబు: కుండలో నీరైనా, ఫ్రిజ్‌లో నీరైనా చల్లబడడం అంటే ఆ నీటిలోని ఉష్ణశక్తి(thermal energy) తగ్గడమే. కొత్త కుండలో నీరు తనలోని ఉష్ణాన్ని త్యాగం చేసి తద్వారా కొంత నీటిని ఆవిరి రూపంలో సాగనంపడం ద్వారా చల్లబడుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన నీటి ఉష్ణాన్ని, ఫ్రిజ్‌లోని శీతలీకరణ వ్యవస్థ తగ్గిస్తుంది. కొత్త కుండల గోడలకు కంటికి కనిపించని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా నీటి అణువులు కుండ ఉపరితలం మీదకు చెమరుస్తాయి. అక్కడ అవి ద్రవస్థితి నుంచి వాయు స్థితికి ఆవిరవుతాయి. నీరు ద్రవస్థితి నుంచి వాయి స్థితికి మారాలంటే కొంత ఉష్ణశక్తి అవసరం. ఈ శక్తిని అవి కుండ గోడలనుంచి, కుండలో నీటినుంచి తీసుకుని ఆవిరవుతాయి. తద్వారా కుండలోని నీరు చల్లబడతుంది. ఇందుకు తగిన పరిస్థితులు వేసవిలో ఎక్కువగా ఉండడం వల్ల ఆ కాలంలో కుండలో నీరు చల్లగా మారడాన్ని స్పష్టంగా గమనించగలుగుతాం. ఇక ఫ్రిజ్‌ విషయానికి వస్తే అందులో శీతలీకరణ ప్రక్రియ వల్ల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. అందువల్ల అందులో ఉంచిన నీటి ఉష్ణోగ్రతను ఫ్రిజ్‌ పరిసరాలు గ్రహిస్తాయి. తద్వారా ఫ్రిజ్‌లో నీరు చల్లబడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కుండలో నీరు తానే ఉష్ణాన్ని వదిలేసి చల్లబడితే, ఫ్రిజ్‌లో నీటి నుంచి ఉష్ణాన్ని ఫ్రిజ్‌ లాగేస్తుంది.

====================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, January 27, 2010

భూగర్భ జలమంటే ఏంటి?,Ground Water-What is it?




ప్రశ్న: భూగర్భ జలాలు అంటే ఏమిటి?

జవాబు: సముద్రపు తీరానో లేక ఒక సరస్సు పక్కన ఉన్న ఇసుకను చేతితో తోడుతూ పోతే కొంతలోతులో నీరు లభిస్తుంది. ఆ నీరే భూగర్భ జలం. నేలపై బావి తవ్వితే అందులో ఊరే నీరు భూగర్భ జలం. భూమిపై కురిసిన వర్షపునీరు, మంచు, వడగళ్లవాన వల్ల ఏర్పడిన నీరు గురత్వాకర్షణ వల్ల నేలపై ఉండే మన్ను, ఇసుక, గులకరాళ్ల పొరలగుండా భూమిలోకి ప్రవేశించి అక్కడ ఉండే రాతి పొరల్లో పయనించి కొంత లోతులో నిక్షిప్తమవుతుంది. సరస్సులలో నదుల్లో, సముద్రాల్లో లభించే నీరు ఉపరితలపు నీరు (surface water). ఉపరితలపు నీరు, భూగర్భ జలాలు వాటి స్థలాలను మార్చుకుంటాయి. భూగర్భ జలాలు భూమిలోని పొరల గుండా సరస్సుల్లోకి, కాలువల్లోకి ప్రవేశింవచ్చు. అలాగే సరస్సుల్లోని నీరు పక్కనే ఉన్న భూభాగంలోకి 'లీకై' భూగర్భ జలంగా మారవచ్చు.

భూగర్భ జలాలను తనలో ఇముడ్చుకొనే ప్రక్రియలో భూమి ఒక పెద్ద స్పాంజిలాంటి పాత్రను పోషిస్తుంది. భూగర్భ జలాన్ని బావులు తవ్వడం ద్వారా, బోరు పంపులు వెయ్యడం ద్వారా భూమిపైకి తీసుకొని వచ్చి, ఆ నీటిని తాగునీటిగా, సేద్యపు నీరుగా వాడుకుంటాం. ఆ విధంగా భూగర్భజలం మానవులకు ప్రకృతి ప్రసాదించిన ఒక బ్యాంక్‌ ఎకౌంట్‌ లాంటిది.

భూగర్భజలాలు చాలావరకు స్వచ్ఛంగానే ఉంటాయి. ఎటొచ్చి భూమి లోపల నిర్మించిన ఆయిల్‌ టాంకర్లు లీక్‌ అయితేనే, పంటపొలాలకు అవసరానికి మించి రసాయనిక ఎరువులు వేయడం వల్లో ఆ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేసే ప్రమాదం ఉంది.



==========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

దిక్సూచి దిక్కుల మర్మమేమిటి?,Magnet secret of north and south poles?





ప్రశ్న: అయస్కాంతం ఉత్తర ధ్రువం, భూమి ఉత్తర ధ్రువం పరస్పరం ఎందుకు వికర్షించుకోవు? దిక్సూచిలో ఉత్తర ధ్రువం, భూమి ఉత్తర ధ్రువం వైపు ఎలా ఉంటుంది?

జవాబు: భూమి విషయం కాసేపు పక్కన పెడితే, ఏవైనా రెండు అయస్కాంతాలను దగ్గరకు తీసుకొస్తే వాటి సజాతి ధ్రువాలు వికర్షించుకొంటాయనేది తెలిసిందే. అలా విజాతి ధ్రువాలు ఆకర్షించుకొంటాయి. అంటే రెండు అయస్కాంతాలను చెరో చేత్తోనూ పట్టుకుని, వాటి సజాతి ధ్రువాలను దగ్గరగా చేర్చడానికి ప్రయత్నిస్తే అవి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు చేతుల మీద కలిగే ప్రభావం ద్వారా తెలుస్తుంది. అదే వాటి విజాతి ధ్రువాలను దగ్గర చేస్తే అవి లటుక్కున అంటుకునేట్లు ఆకర్షించుకొంటాయి.

ఒక నాణానికి బొమ్మ, బొరుసులను గుర్తించినట్టుగా ఒక అయస్కాంతానికి ఏది ఉత్తర ధ్రువమో, ఏది దక్షిణ ధ్రువమో గుర్తించడం ఎలా? ఇక్కడే భూమి మనకు సాయపడుతుంది. భూమి కూడా పెద్ద అయస్కాంతమని మనకు తెలుసు. ఒక దండాయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుందని పాఠాల్లో చదువుకున్నారు. అందువల్లనే అయస్కాంతంలో భూమి ఉత్తరం దిశను సూచించే కొసను ఉత్తర ధ్రువమని, దక్షిణ దిశను సూచించే కొసను దక్షిణ ధ్రువమని మనం గుర్తుపెట్టుకున్నాం. నిజానికి భూమి ఉత్తర ధ్రువం, ఉత్తరదిశను సూచించే అయస్కాంత ధ్రువం, రెండూ విజాతి ధ్రువాలు. అలాగే దక్షిణం వైపున్న భూ అయస్కాంత ధ్రువము, ఆ వైపు మళ్లిన అయస్కాంత ధ్రువం కూడా విజాతి ధ్రువాలే.

=============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ఇసుక ఎలా తయారవుతుంది?,How is Sand madeup?n





ప్రశ్న: ఇసుక ఎలా ఏర్పడుతుంది?

జవాబు: మన భూమిపై ఉండే నేలలోని ఒక అంశం ఇసుక. ఇసుక సముద్రతీరాల్లో, ఎడారుల్లో 0.06 మిల్లీమీటర్ల నుంచి 2 మిల్లీమీటర్ల వ్యాసం గల రేణువుల రూపంలో విడివిడిగా ఉంటుంది. భూమిపై ఉండే ప్రతి 'శిల' (rock) వాతావరణ ప్రభావం వల్ల కాలం గడిచే కొలదీ అరుగుదలకు లోనవుతూ నిదానంగా వివిధ పదార్థాలుగా విడిపోతుంది. ప్రకృతి సహజమైన వర్షం, గాలి మంచు, వడగళ్ల ప్రభావం వల్ల పెద్ద శిలలు కూడా ముక్కచెక్కలవుతాయి. అవి ఎంత సూక్ష్మమైన భాగాలుగా మారినా వాటి రసాయనిక ధర్మాలలో మార్పు ఉండదు. కాని వాతావరణంలో అప్రయత్నంగా సంభవించే ఆసిడ్‌ వర్షాల లాంటి రసాయనిక సంఘటనల వల్ల ఆ శిలా భాగాలు ఖనిజాలుగా, అల్యూమినియం, ఐరన్‌ ఆక్సైడ్‌లుగా, సిలికాన్‌గా మార్పు చెందుతాయి. మారిపోయిన కొన్ని భాగాలు కలిసి బంకమన్నుగా మారితే, మరో రెండుభాగాలు ఇసుక (లేక quartz), స్లిట్‌గా మిగిలిపోతాయి. ఈ విధంగా శిలలు రూపాంతరం చెందడంలో గురుత్వశక్తుల ప్రమేయం కూడా ఉంటుంది. అలా ఏర్పడిన బంకమన్ను, స్లిట్‌, ఇసుక ఒకటిగా కలిసిపోయి 'లోమ్‌' అనే పదార్థం ఏర్పడుతుంది. శిల, లోమ్‌ రూపం సంతరించుకోవడానికి లక్షలాది సంవత్సరాలు పడుతుంది.

భూభాగం సముద్రపు అలల వల్ల కోతకు గురయినప్పుడు వేగంగా వీచే గాలుల ప్రభావం కూడా తోడవడంతో లోమ్‌ సముద్రపు లోతుల్లోకి చేరుకొని అక్కడి భూభాగం పై పరుచుకుంటుంది. అక్కడ నీటి వేగం ధాటికి లోమ్‌ మళ్లీ బంకమన్ను, స్లిట్‌, ఇసుకలుగా విడిపోతుంది. బంకమన్ను, స్లిట్‌ లోతుగా, నిశ్చలంగా ఉండే సముద్రపు అడుగుభాగానికి అంటుకొని పోతాయి. అన్నిటికన్నా ఎక్కువ పరిమాణంలో ఏర్పడిన ఇసుక సముద్రపు అలల ద్వారా తీరానికి కొట్టుకొని రావడం వల్ల సముద్రపు తీరాల్లో ఇసుక ఎక్కువ మేర పరుచుకుంటుంది. అలా ఏర్పడినవే సముద్ర తీరాలు, బీచ్‌లు. ఎడారుల్లో ఇసుక ఏర్పడేది కూడా శిలలు విచ్ఛిన్నమవడం వల్లే.


  • ================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, January 26, 2010

వూదితే కొవ్వొత్తి ఆరుతుందేల?, Candle litout with blowout air





ప్రశ్న: గాలిలోని ఆక్సిజన్‌ వల్ల మంట మండుతుంది. కానీ వెలుగుతున్న కొవ్వొత్తిని వూదితే ప్రకాశంగా వెలగాలి గానీ ఆరిపోతుంది. కారణం తెలపండి?

జవాబు: వెలుగుతున్న కొవ్వొత్తిని వూదితే చాలాసార్లు ఆరిపోతుంది. అయితే ఒకోసారి ప్రకాశవంతంగా వెలగచ్చు కూడా. ఈ రెండింటికీ కారణాలు తెలుసుకుందాం.

కొవ్వొత్తి వెలిగేపుడు కేవలం ఆక్సిజన్‌ సరఫరా ఒక్కటే ఆ వెలుగును నిర్ధరించదు. మంట వేడితో మైనం కరిగి వత్తి గుండా తలతన్యత (surface tension), కేశనాళికీయత(capillarity),విసరణం (diffusion)అనే ధర్మాల ప్రభావంతో మంట వద్దకు చేరుతుంది. తద్వారా మంటకి ఎప్పటికప్పుడు ఇంధన సరఫరా జరుగుతుంటుంది. మంట మండాలంటే వత్తి దగ్గర తగిన ఉష్ణోగ్రత ఉండాలి. మైనపు ద్రవంలోని అణువులు ఆవిరి చెందడంవల్ల త్వరితంగా మండేందుకు కావాల్సిన ఉత్తేజశక్తి (activation energy) లభ్యమవుతుంది. ఇవన్నీ కుదిరాక ఆక్సిజన్‌ సరఫరా బాగా ఉంటే మంట బాగా మండుతుంది. కొవ్వొత్తిని గట్టిగా వూదితే మన నోటి గాలి వత్తి ప్రాంతంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పైగా మనం వదిలేది కార్బన్‌డైయాక్సైడ్‌. అది కూడా ఆక్సిజన్‌ను తొలగించి వేస్తుంది. అందువల్ల ఆరిపోతుంది. ఇక మెల్లగా వూదితే అక్కడ పేరుకుపోయిన కార్బన్‌డయాక్సైడును మనం దూరానికి పంపినవారమవుతాము. అపుడు ఆక్సిజన్‌ బాగా అంది వెలుగు బాగా వస్తుంది.
=============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

సర్వ శక్తులు ఎన్ని?,Energies in the Universe






ప్రశ్న: విశ్వంలోని శక్తులు ఎన్ని?

జవాబు: ఈ విశాల విశ్వాన్ని నడిపించే శక్తులు నాలుగు

1. గురుత్వాకర్షణ శక్తి: కుర్చీల లాంటి వస్తువులు నేలకు అంటుకొని ఉండడానికి, మనం నేలపై నిలకడగా నిలబడి ఉండడానికి, చెట్టునుంచి రాలిన పండు నేలపై పడడానికి కారణం గురుత్వాకర్షణ శక్తే. నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడేందుకు, కక్ష్యల్లో తిరిగేందుకు కూడా ఇదే కారణం. అన్ని శక్తుల్లోకెల్లా బలహీనమైంది. కానీ దీని వ్యవధి (range) అనంత దూరాలకు వ్యాపించి ఉంటుంది.

2. విద్యుదయస్కాంత శక్తి: విద్యుదావేశాల మధ్య ఆకర్షణ, వికర్షణలకు పరమాణు నిర్మాణానికి, కాంతి వెలువడేందుకు కారణం ఈ శక్తే. విద్యుత్‌ బల్బులు వెలిగేందుకు, లిఫ్టులు, టీవీ, కంప్యూటర్లు పనిచేయడానికి ఇదే మూలాధారం. దీని అవధి అనంతం (infinite)

3. దుర్బల కేంద్రక శక్తి: ఇది పరమాణు కేంద్రకానికి సంబంధించిన శక్తి. యురేనియం లాంటి రేడియోధార్మిక మూలకాల కేంద్రకం విచ్ఛిన్నమవుతున్నపుడు ప్రాథమిక కణాలను వెలువరించేందుకు ఈ శక్తి ఉపయోగపడుతుంది. దీని అవధి చాలా తక్కువ. 10-14 మీటర్లు మాత్రమే!

4. ప్రబల కేంద్రక శక్తి: పరమాణువులోని కేంద్రకాలను ఒకటిగా నిలకడగా ఉంచే శక్తి ఇది. ప్రోటాన్లు, న్యూట్రాన్లు వీటిలో ఉండే క్వార్కులు, ఇలా పరమాణు కేంద్రకంలో వాటినన్నింటినీ బందించి ఒకే చోట ఉంచేది ఈ శక్తే. ఈ శక్తి అవధి 10-11 మీటర్లు మాత్రమే.

కేంద్రక శక్తుల వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మూలకాలు ఏర్పడుతున్నాయి. మన శరీరంలో ఉన్న కార్బన్‌, ఆక్సిజన్‌లకు కూడా కేంద్రక శక్తులే కారణం. బిగ్‌బ్యాంగ్‌ వల్ల విశ్వం ఏర్పడక ముందు ఈ శక్తులన్నీ ఒకటిగా కలిసి ఉండేవి. ఆ తర్వాత నాలుగుగా విడిపోయాయి. ఈ శక్తులమధ్య సంబంధం ఏమిటన్న విషయం తెలిస్తే విజ్ఞాన శాస్త్రం ఎంతో పురోగమించడమే కాకుండా మనం ఏదో తెలియని అతీత శక్తుల అధీనంలో ఉన్నామనే కొందరి అపోహలు తొలగిపోతాయి.

===========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

పంది బొమ్మే ఎందుకు?,Pig image only-Why?






ప్రశ్న: ఏదైనా బ్యాంకుగానీ, పోస్టాఫీసుగానీ పొదుపు కోసం చూపే ప్రకటనల్లో పంది బొమ్మను చూపుతారు ఎందుకు?

జవాబు: డబ్బులు దాచుకోడానికి ప్రోత్సహించే ప్రకటల్లోనూ, అందుకోసం హుండీల్లాగా తయారు చేసే బొమ్మల్లోనూ ఎక్కువగా పంది రూపమే కనిపించడానికి కారణం ఉంది. ఒకప్పుడు బ్రిటన్‌లో pygg పదాన్ని ఒక రకమైన బంకమట్టికి వాడేవారు. దీంతో కూజాలు లాంటి పాత్రలను చేసేవారు. ఇలా తయారు చేసే బుల్లి పాత్రల్లో నాణేలను దాచుకునేవారు. వాటిని pygg jars అనేవారు. అదే కాలక్రమేణా 'పిగ్‌ బ్యాంక్‌'గా మారిందని చెబుతారు. పైగా డబ్బులు దాచుకునేందుకు పంది ఆకారంలో పాత్రను చేయడం సులువుగా ఉండేది. ఇంకోలా చూస్తే, చాలా క్షీరదాల కన్నా పంది బాగా తింటుంది. దాంట్లో చాలా భాగం శరీరాన్ని పెంచుకోవడానికే ఉపయోగపడుతుంది. చర్మపు నిర్మాణం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. ఆహారం దొరకని సందర్భాల్లో ఆ కొవ్వునే తిరిగి పిండి పదార్థాలుగా మార్చుకొని (gluco gluesis) ఎక్కువ కాలం బతగ్గలదు.

మరో కారణం అది ఎక్కువ పిల్లల్ని కంటుంది. పెద్ద క్షీరదాల (mammals)లో ఒకే తడవులో ఎక్కువ పిల్లల్ని కనేది ఇదే. దాచుకోవడం, పొదుపుగా ఉండడం, వృద్ధి చేయడం అనే లక్షణాలకు పంది ఒక ఉదాహరణ అనడంతో సందేహం ఏముంది? డబ్బును దాచుకుంటే వడ్డీతో సహా ఎక్కువ రాబడి ఉంటుందన్న అర్ధం ఇందులో ఉంది.

=============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ఋతుపవనాలు అంటే ఏమిటి?, Seasonal rainfall-What?





రుతు పవనాలు అంటే ఏమిటి?

జవాబు:
ఋతువు ప్రకారము వీచే గాలులే ఋతుపవనాలు . పవనము అంటే గాలి , ఋతువులు అంటే కాలము ; కాలాన్ని  బట్టి అనగా వేసవి కాలము , వర్షాకాలము , శీతాకాలము లలో వీచే గాలులు ఒక్కోదిశలో వీస్తాయి.
వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటే తెగ బాధపడిపోతాం. కాని ఎండలు ఎంత ఎక్కువగా ఉంటే వానలు అంత బాగా పడతాయని తెలుసా? వేసవిలో సూర్య కిరణాలు భూమ్మీద ఎలా పడతాయో, సముద్రం మీద కూడా అలాగే పడతాయి. కానీ సముద్రం కన్నా భూమి బాగా వేడెక్కుతుంది. భూమితో పాటు దానిని ఆనుకుని ఉన్న గాలులు కూడా వేడెక్కుతాయి. ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆ గాలులు వ్యాకోచించి తేలికై, పైకి పోతాయి. అలా పైకి వెళ్లే వేడి గాలుల స్థానాన్ని భర్తీ చేయడానికి సముద్రం పై నుంచి గాలులు భూమి పైకి సమాంతరంగా వీస్తాయి. ఈ గాలులు తేమగా, ఎక్కువ నీటియావిరితో నిండి ఉంటాయి. ఎందుకంటే ఎండ వేడికి సముద్రాల నీరు ఎక్కువ ఆవిరవుతుంది కదా? ఆ నీటి ఆవిరితో ఈ గాలులు నిండి ఉంటాయన్నమాట. ఈ గాలులే రుతుపవనాలకు కారణం.

వేసవి కాలంలో సముద్రాల్లో ఎక్కువ నీరు ఆవిరవుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో పీడనం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో నేల (land) వేడెక్కడం వల్ల ఆ ప్రాంతాల్లో గాలులు వ్యాకోచించి పీడనం తక్కువగా ఉంటుంది. గాలులెప్పుడూ అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాలకు వీస్తాయని తెలుసుగా? ఇలా పీడనాల్లో వ్యత్యాసాలు బాగా ఎక్కువైన పరిస్థితుల్లో సముద్రాల మీద నుంచి గాలులు నేల వైపు బలంగా వీచడం మొదలెడతాయి. సాధారణంగా ఈ పరిస్థితులు జూన్‌ నుంచి ప్రారంభమవుతాయి.

ప్రతి ఏటా వేసవి కాలంలో దక్షిణ ఆసియాలోని హిందూ మహా సముద్రం నుంచి భూభాగం వైపు, శీతకాలంలో భూమి నుంచి సముద్రంవైపు వీచే గాలులనే రుతుపవనాలంటారు. సముద్రం నుంచి భూభాగం వైపు వీచే గాలులను నైరుతి రుతు పవనాలంటారు. శీతకాలంలో భూమి నుంచి సముద్రం వైపు వీచే గాలులను ఈశాన్య రుతుపవనాలు అంటారు.

మన దేశంలో 90 శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల వల్లనే పడతాయి. జూన్‌ నెల మధ్యలో పయనించే ఈ గాలులను హిమాలయ పర్వతాలు అడ్డుకోవడంతో వర్షాలు కురుస్తాయి. ఇందుకు విరుద్ధంగా శీత కాలంలో మధ్య ఆసియాలో, ఉత్తర భారతంలో సముద్ర తీర ప్రాంతం నుంచి అతి చల్లని పొడిగాలులు తీవ్రంగా వీస్తాయి. సముద్ర జలాలతో పోలిస్తే దానికి ఆనుకుని ఉండే భూమి త్వరగా వేడెక్కడమే కాకుండా, త్వరగా చల్లబడుతుంది కూడా. దక్షిణ దిశలో ఉండే హిందూ మహాసముద్రం, తూర్పున ఉండే పసిఫిక్‌ మహా సముద్రాలతో పోలిస్తే, మధ్య ఆసియా, దక్షిణ ఆసియా ప్రాంతాలు వేసవిలో బాగా వేడెక్కుతాయి. అందువల్ల ఆయా భూభాగాలపై ఉండే గాలి వేడెక్కి, వ్యాకోచిస్తుంది. తద్వారా దాని పీడనం తగ్గుతుంది. గాలులు ఎప్పుడూ తక్కువ పీడనం ఉన్న వైపు వేగంగా ప్రయాణిస్తాయని తెలుసుకదా? అందువల్లనే సముద్రాల మీంచి గాలులు వేగంగా భూభాగాలపైకి వీస్తాయి.

ఇక శీత కాలంలో ఆసియా భూభాగమంతా త్వరగా చల్లబడడం వల్ల దానిని ఆనుకుని ఉన్న సముద్రపు ఉష్ణోగ్రతే ఎక్కువగా ఉంటుంది. అంటే భూమిపై ఉన్న గాలులు సంకోచిస్తే, సముద్రాలపై ఉన్న గాలులు వ్యాకోచిస్తాయన్నమాట. సముద్రాలపై పీడనం తక్కువగా ఉండడం వల్లభూమిపై గాలులు ఆ దిశగా ప్రయాణిస్తాయి. ఇలా శీతకాలంలో పొడిబారిన తీరప్రాంతం నుంచి గాలులు (ఈశాన్య రుతుపవనాలు) సముద్రం వైపు వీస్తాయి. ఈ రుతుపవనాల ప్రభావం ఎక్కువగా దక్షిణ, తూర్పు ఆసియాలపై ఉండడానికి కారణం వాటి భూభాగాల వైశాల్యం ఎక్కువగా ఉండడమే.
=============================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కిరణ జన్య సంయోగక్రియ అలా సాధ్యమేనా?,photosynthesis in seperated leaf




ప్రశ్న: మొక్క నుంచి ఆకుని వేరుచేశాక దానికి నీరు, కార్బన్‌డైయాక్సైడ్‌, కాంతి అందజేస్తే అందులో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందా?

జవాబు: కొద్దిసేపే జరుగుతుంది. అవిచ్ఛిన్నంగా జరగదు. ఆకులో కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) జరిపేందుకు ఆ మూడు విషయాలే కాకుండా వాటిని నడిపించే రసాయనిక దర్శకుడు కావాలి. ఆ పెద్దమనిషి పేరు క్లోరోఫిల్‌. క్లోరోఫిల్‌ ఎప్పటికప్పుడు తయారవుతూ ఉండాలి.

క్లోరోఫిల్‌ తయారు కావాలంటే మెగ్నీషియం, శక్తి, ఇతర రసాయనిక పదార్థాలు, ఆహార పదార్థాలు కావాలి. ఆకు మామూలుగా చెట్టుకు అంటి పెట్టుకొని ఉన్నప్పుడు తల్లి లాంటి చెట్టు నుంచి తనక్కావలసిన పదార్థాలను, లవణాలను గ్రహిస్తుంది. చెట్టునుంచి వేరు పడ్డాక జీవన బంధం (live contact) తెగిపోతుంది.

తనలో ఉన్న క్లోరోఫిల్‌ తదితర పదార్థాలు ఉన్నంతవరకు కిరణజన్య సంయోగక్రియ జరపగలదు. తద్వారా ఏర్పడిన పిండి పదార్థాల రేణువుల్ని రవాణాచేసే యంత్రాంగం కూడా ఆకుకు స్వతహాగా లేదు. ఆకుల్లోని ఈనెలు, తొడిమ, కొమ్మ, కాండం వంటి రవాణా యంత్రాంగం ఉన్నపుడే అన్నీ సవ్యంగా సాగుతాయి.


=============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, January 25, 2010

అంతరిక్ష నౌకలు ఉల్కల్లా మండిపోవేం?,Setellites won't burn-why?




ప్రశ్న: రోదసి నుంచి రాలే ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతాయి. కానీ స్పేస్‌ షటిల్స్‌కు ఆ ప్రమాదం లేదు. ఎందుకని?

జవాబు: రోదసిలోని శూన్యం గుండా ఉల్కలు (meteors) భూ వాతావరణంలోకి గంటకు వేలకొద్దీ కిలోమీటర్ల వేగంతో ప్రవేశిస్తాయి. అలా వచ్చే ఉల్క వాతావరణాన్ని ఢీకొనగానే అక్కడున్న గాలి అత్యంత ఒత్తిడికి గురవుతుంది. అందువల్ల అక్కడి గాలి ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. ఆ ఉష్ణం వల్ల అతిగా వేడెక్కిన ఉల్క వెలుగులు చిమ్ముతూ పూర్తిగా ఏమీ మిగలకుండా మండిపోతుంది. అలా వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్క ఉష్ణోగ్రత దాదాపు 1650 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు చేరుకుంటుంది.
అలాగే అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు కూడా ఇంతటి ఘర్షణ ఏర్పడుతుంది. అయితే అది ఉల్కలా మండిపోకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అంతరిక్ష నౌక ఉపరితలంపై సిలికా, సిలికాన్‌డై ఆక్సైడ్‌ పూతపూసిన పలకలను అమరుస్తారు. ఈ పలకలు 93 శాతం వరకు సచ్చిద్రత (porosity) అంటే అతి సన్నని రంధ్రాలను కలిగి ఉంటాయి. అందువల్ల అంతరిక్ష నౌక వాతావరణంలోకి ప్రవేశించినపుడు జనించే అత్యధిక ఉష్ణశక్తి, ఆ పలకల్లో ఒక భాగం నుంచి మరో భాగానికి ప్రవహించదు. సిలికాన్‌ ఉష్ణ వ్యాకోచ ధర్మం (thermal expansion), ఉష్ణ వాహకత్వం (thermal conduction) అతి తక్కువ. అందువల్ల సిలికా పలకలు సంపూర్ణ అధమ వాహకాలు(perfect insulators) గా పనిచేస్తాయి.
సిలికా పలక అంచులను రెండు చేతులతో పట్టుకుని దాని మధ్య ప్రదేశాన్ని ఎర్రని వెలుగు వచ్చే వరకు వేడి చేసినా, ఆ ఉష్ణం పలకను పట్టుకున్న వ్యక్తి చేతులకు సోకదు. అంటే ఆ ఉష్ణశక్తి పలకల అంచులకు చేరుకోదన్నమాట. వీటివల్లనే అంతరిక్ష నౌకలు క్షేమంగా భూమి పైకి చేరుకోగలుగుతాయి.





===========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

సినిమా థియేటర్లలో ఆ తేడాలేంటి?, Cinema 35mm and 70mm difference






ప్రశ్న: 70mm సినిమాథియేటర్‌కు, 35mm థియేటర్‌కు తేడా ఏంటి?

జవాబు: మనం సాధారణంగా ఎడమ నుంచి కుడికి ఎక్కువ విస్తారాన్ని, పై నుంచి కిందికి తక్కువ విస్తారాన్ని చూస్తుంటాము. అందువల్లనే సినిమా థియేటర్లలో తెర ఎడమ కుడి దిశల్లో (అడ్డంగా) ఎక్కువగానూ, పైనుంచి కిందికి (నిలువుగా) తక్కువగానూ ఉంటుంది.

ఇలా అడ్డానికి, నిలువుకి ఉన్న నిష్పత్తిని ఆస్పెక్ట్‌ నిష్పత్తి (aspect ratio) అంటారు. చాలా కాలం పాటు (నేటికీ చాలా చోట్ల) ఇది 4:3 నిష్పత్తిలో ఉండేది. సినిమా స్కోపు ప్రక్రియలో ఇది 16:9 లేదా 37:20 లేదా 47:20 నిష్పత్తిలో ఉంటుంది. ఆ విధంగా క్రమేపీ నిలువు కన్నా అడ్డం పెరుగుతూ వచ్చింది. తద్వారా కుడి నుంచి ఎడమకి ఎక్కువ విస్తారంలో దృశ్యాల్ని తెరమీద చూసే అవకాశం ఏర్పడింది. ఇంకో మాటలో చెప్పాలంటే 4:3aspect ratio ఉన్న తెర మీద కన్నా సినిమా స్కోపు తెరమీద ఎక్కువ మంది పాత్రలను, దృశ్యాలను మోహరించవచ్చును. సాధారణ తెర అయినా, పైన చెప్పిన మూడు రకాల సినిమా స్కోపు తెర అయినా, దాని మీదకు బొమ్మను పంపే ఫిల్మ్‌లో దృశ్యం పొడవు, వెడల్పుల నిష్పత్తి మాత్రం మారదు. మామూలు ప్రొజెక్టరులో రీళ్లుగా తిరిగే ఫిల్మును 35mm ఫిల్మ్‌ అంటారు. ఎందుకంటే దాని అడ్డం 35 మిల్లీమీటర్లు, నిలువు సుమారు 26 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇంత చిన్న ఫిల్ము నుంచి ప్రకాశవంతమైన కాంతి మామూలు థియేటర్లలోని (35mm) తెరమీద పడ్డం వల్ల బొమ్మల స్పష్టత పెద్దగా తగ్గదు. కానీ ఇదే ఫిల్మును చాలా పెద్ద తెరమీద ప్రదర్శించినప్పుడు బొమ్మల స్పష్టత తగ్గి పోతుంది. అందువల్ల 35 mm ఫిల్ము కన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న ఫిల్మును ఆయా పెద్ద థియేటర్లలో వాడతారు. ఇలాంటి పెద్ద థియేటర్లలో వాడే ఫిల్మ్‌ అడ్డం కొలత 70mm ఉంటుంది.


==========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

చంద్రునిపై నీరుండడం నిజమేనా?,Water on the Moon




ప్రశ్న: 'ఇస్రో' శాస్త్రజ్ఞులు ప్రయోగించిన చంద్రయాన్‌-1 ద్వారా చంద్రునిపై నీరున్నట్లు గుర్తించారని చదివాను. అసలు, చంద్రునిపై నీరు ఎలా సాధ్యం?

జవాబు: చంద్రునిపై నీరుందని ఇస్రో శాస్త్రజ్ఞులు ప్రకటించారంటే, అక్కడ నీరు సముద్రాలు, కాలువల రూపంలో ఉందని కాదు. నీటికి సంబంధించిన హైడ్రాక్సైల్‌ (హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల సమ్మేళనం) అణువులను మాత్రమే చంద్రయాన్‌లోని ఒక పరికరమైన 'మూన్‌ మినరాలజీ మాపర్‌' ద్వారా గుర్తించారు.

ఆ విధంగా జాబిలిపై జలం ఆనవాళ్లు ఉండటానికి ఒక కారణం చంద్రుని ఉపరితలాన్ని 3.9 బిలియన్‌ సంవత్సరాల క్రితం క్రమం తప్పకుండా ఢీకొన్న తోక చుక్కలు (comets), ఉల్కలు (meteorites) కావచ్చు. ఇవి తమలో ఉన్న నీటిని అక్కడ వదలి ఉండాలి. ఆ నీటిలో చాలావరకు ఆవిరయిపోగా ఇపుడు గర్తించిన నీటి ఆనవాళ్లు మిగిలిన నీటికి సంబంధించినవి.

మరోకారణం, చంద్రుని ఉపరితలాన్ని అతి వేగంగా తాకుతున్న సూర్యుని నుంచి వీచే అతి శక్తిమంతమైన గాలుల (solar winds) లోని ప్రోటాన్లు. ఈ ప్రోటాన్లు, అందులో ఉండే హైడ్రోజన్‌ అయాన్లు చంద్రుని ఉపరితలాన్ని అత్యంత వేగంతో అంటే, సెకనుకు 100 కిలోమీటర్లు వేగంతో ఢీకొంటున్నాయి. సూర్యుని ఉపరితలంలోని నేలలో, రాళ్లలో 40 శాతం ఆక్సిజన్‌ ఉంది. సూర్యుని నుంచి వేగంగా వచ్చిన ప్రోటాన్ల అభిఘాతాల (collisions) వల్ల చంద్ర శిలలు, నేలలోని ఆక్సిజన్‌ విడుదలై ప్రోటాన్లలోని హైడ్రోజన్‌తో కలిసి నీటికి సంబంధించిన హైడ్రాక్సైల్‌ అణువులను చంద్రునినపై ఏర్పరిచి ఉండవచ్చు.

ఈ నీటికి సంబంధించిన అణువులు ధృవాల దగ్గర ఎక్కువగా ఉన్నాయని, అక్కడ నుంచి 10 డిగ్రీలమేర ఉత్తర, దక్షిణ దిశలకు చంద్రుని నేలలో వ్యాపించాయని చంద్రయాన్‌-1 ప్రయోగం నిర్ధరించింది. ఒకటన్ను చంద్రుని మట్టిలో ఒకలీటరు నీరు ఉండవచ్చని శాస్త్రజ్ఞుల అంచనా.

మన దేశానికి చెందిన ఇస్రో ప్రయోగం చంద్రుని భూమిలో ఒక సెంటీమీటరు లోతులో ఉండే నీటి ఆనవాళ్లను కనుగొనగా, అమెరికాలోని 'నాసా' జరిపిన ప్రయోగం ఇంకా లోతుగా ఉండే ప్రదేశంలో నీటి జాడలను అన్వేషిస్తోంది.






============================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

చెముడుంటే మాటలు రావా?, Deaf and Dumb




ప్రశ్న: చెముడు ఉన్నవారు క్రమంగా మూగవారవుతుంటారు. అలా ఎందుకు జరుగుతుంది?

జవాబు: మాటలు బాగా నేర్చుకున్నాక, పెద్దయ్యాక, ఏదైనా ప్రమాదవశాత్తూ చెవుడు (deaf) వస్తే వారేమీ క్రమంగా మూగ (dumb) వారు కారు. కేవలం పుట్టుకతోనూ లేదా మాటలు రాని వయసులోనూ చెవుడు వస్తే వారు తప్పకుండా మూగవారవుతారు. ఎందుకంటే ప్రతి మనిషి తన చుట్టుపక్కల ఉన్న సమాజపు, కుటుంబపు, పరిసరాల్లో జరిగే సంభాషణలను వింటూ ఆ వ్యక్తుల ముఖకవళికలను చూడ్డం ద్వారా (మాట్లాడే భాష) నేర్చుకుంటాడు. అచ్చ తెలుగు మాత్రమే మాట్లాడే తల్లిదండ్రుల బిడ్డను పుట్టిన కొన్ని నెలలకే ఒరియా భాష మాత్రమే మాట్లాడే పరిసరాల్లో పెంచితే ఆ బిడ్డ క్రమేపీ ఆ భాషనే మాట్లాడేలా ఎదుగుతాడు.

చెవుడు ఉన్న బిడ్డ తన చుట్టూ ఉన్న శబ్దాలను, భాషను వినలేడు కాబట్టి ఏ విధంగా తన నోటిలోని శబ్ద వ్యవస్థను కదిలిస్తే ఎలాంటి శబ్దాలు పుడతాయో తెలసుకోలేడు. కాబట్టి ఏ భాషా రాని 'బ' 'బ' 'బ' శబ్దాలు (ఇదే అతిసులువైన శబ్దం) మాత్రమే చేయగలడు.

మాట్లాడడం సామాజికాంశం. గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని 'టార్జాన్‌' మాత్రమే కాగలడు.

ముక్కు, వూపిరితిత్తులు, సప్తపథ (pharynx), నాలుక, పళ్లు, దవడలు, పెదాలు, అంగిటి లాంటి అనేక భాగాల సమన్వయంతో చేసే శబ్దాన్ని వినలేకపోతేే వాటి సాయంతో పలకగలిగే శక్తిరాదు.


===========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

మలుపులో కుదుపులేల?,Shaking in a Curved road







ప్రశ్న: నేరుగా రోడ్డుపై పోతున్న బస్సు మలుపు తిరుగుతున్నప్పుడు మనం పక్కవారిపై ఒరుగుతామెందుకు?

జవాబు: సరళ మార్గంలో వేగంతో పయనిస్తున్న బస్సు లేదా రైలు తటాలున వక్రమార్గం (curved path)లోకి మలుపు తిరిగేప్పుడు ఏం జరుగుతుందో తెలియాలంటే న్యూటన్‌ గమన సూత్రం అర్థం కావాలి. ఈ సూత్రం ప్రకారం, ఏదైనా ఒక వాహనం సరళమార్గం నుండి వక్రమార్గంలోకి పయనించాలంటే దానిపై కొంత బాహ్య బలం పనిచేయాలి. ఈ బాహ్యబలం వక్రమార్గ కేంద్రంవైపు పనిచేస్తుంది. అందువల్ల ఈ బలాన్ని అభికేంద్రకబలం (centrepetal force) అంటారు. ఈ బలం బస్సు విషయంలో దాని టైర్లకు, రోడ్డుకు మధ్య జరిగే రాపిడి లేక ఘర్షణ (friction) వల్ల లభిస్తుంది.

భౌతికశాస్త్ర నియమం ప్రకారం ఏ వస్తువుపైనైనా అభికేంద్రకబలం పనిచేస్తే అదే సమయంలో దానిపై అంతే పరిమాణంగల అపకేంద్రకబలం (centrifugal force) వ్యతిరేక దిశలో పని చేస్తుంది. వక్రమార్గంలో పయనించే బస్సు వెలుపల వైపునకు పనిచేసే ఈ అపకేంద్రక బలం ప్రయాణికులపై కూడా పనిచేస్తుంది. అందువల్లనే ప్రయాణికులు తమ సీట్లలోనే బస్సు మలుపు తిరిగిన దిశకు వ్యతిరేక దిశగా తమ పక్కనున్న ప్రయాణికులపైకి ఒరుగుతారు.

========================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సాలెగూడులో ఆ అవశేషాలేంటి?,SpiderWeb Reminants






ప్రశ్న: సాలెగూడులో బోలుగావుండే కీటకాల అవశేషాలు ఎక్కడనుంచి వస్తాయి?

జవాబు: సాలెపురుగు తన ఉదరభాగానికి కిందివైపున ఉండే గ్రంధుల నుంచి స్రవించే ద్రవం సాయంతో గూడును అల్లుతుంది. ఆ ద్రవం గట్టిపడి దారంలాగా అవుతుంటుంది. సాలెగూడు దారాలు సన్నగా దృఢంగా ఉండటమేకాకుండా ఒక జిగురులాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి. గాలిలో ఎగురుతూ వచ్చే కీటకాలు గూడును గమనించలేక దాన్ని తాకి కాళ్లు, రెక్కలు అతుక్కుపోయి చిక్కుకుంటాయి. అక్కడ నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో వాటి దేహాలు మరిన్ని దారాలకు చుట్టుకుపోతాయి. కీటకాల కదలికలతో గూడు కంపించడం వల్ల ఏ మూలనో ఉన్న సాలె పురుగు వాటిని గ్రహించి అతి వేగంగా అక్కడికి చేరుకుంటుంది.

సాలెపురుగు నోటిలో విష గ్రంధులతోపాటు పొడవైన, పదునైన పలువరస ఉంటుంది. ఆ పళ్లతో కీటకాన్ని పట్టుకోగానే విషం దాని దేహంలో ప్రవేశించి చనిపోతుంది. సాలెపురుగు తన ఆహారాన్ని ద్రవరూపంలో మాత్రమే తీసుకోగలుగుతుంది. అందువల్ల చనిపోయిన కీటకం దేహంలోకి సాలెపురుగు తన నోటిలోని కొన్ని స్రావాలను ప్రవహింపజేస్తుంది. అప్పుడు కీటకంలోని మెత్తని భాగాలు ద్రవ రూపంలోకి మారతాయి. వాటిని సాలీడు నోటితో పీల్చుకుంటుంది. కీటకం శరీరంలో దృఢంగా ఉండే కర్పరం (shell)లాంటి భాగాలు ద్రవరూపంలోకి మారవు కాబట్టి అవి అలాగే మిగిలిపోతాయి. అవే సాలెగూటిలో బోలుగా కనిపించే అవశేషాలన్నమాట.





===========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.
http://dr.seshagirirao.tripod.com/

కావల్సినంత డబ్బు ముద్రించుకోలేమా?,Why can't we print enough money?








ప్రశ్న: కేంద్ర ప్రభుత్వంలో ఏ బ్యాంకు వారు కరెన్సీని తయారుచేస్తారు?మనం కావాల్సినంత కరెన్సీని ముద్రించుకొని నడుపుకోవచ్చుగా! విదేశాల నుంచి రుణం ఎందుకు తీసుకోవాలి?

జవాబు: చాలా మందికి కలిగే సాధారణ సందేహం ఇది. కరెన్సీకి స్వతహాగా ఏ విలువాలేదు. అది రాసుకోవడానికి కూడా ఉపయోగపడదు. ఎందుకంటే అందులో తెల్లగా ఉండే భాగం దాదాపు శూన్యం. కరెన్సీ కేవలం మారకం (exchange) కోసం ఏర్పరుచుకున్న మధ్యవర్తి (mediator) మాత్రమే! దేశంలో వివిధ రకాలైన ఉత్పత్తులు (products) ఉంటాయి. మానవశ్రమ కలవడం వల్ల వాటి మారకపు విలువ (exchange value) వస్తుంది. అటువంటి వస్తువులు, సేవలు, ఉత్పత్తులు ప్రజలకు అవసరం. ఏ వ్యక్తికీ అవసరంలేని ఉత్పత్తిని ఏ దేశమూ తయారు చేయదు.

కరెన్సీ గురించి కాసేపు మరిచిపోయి ఓ ఉదాహరణ చూద్దాం. మీరు, మీ స్నేహితుడు కలిసి కష్టపడి పెన్నులు తయారు చేశారనుకుందాం. ఇద్దరికీ ఆకలేసి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటరుకు వెళ్లారు. అక్కడ మీకు దోశలు తినాలనిపించింది. ఫాస్ట్‌ఫుడ్‌ వాడికి పెన్నులు కావాలి. ఒక్కో పెన్నుకు ఒక్కో దోశనుకుందాం. మీరు రెండు పెన్నులు ఇస్తే తను మీకు రెండు దోశల టోకెన్లు ఇస్తాడు. ఆ టోకెన్లు మీరు కౌంటర్‌ దగ్గర ఇస్తే అక్కడ ఉన్న వంటవాడు మీకు దోశల్ని ఇస్తాడు. ఇక్కడ టోకెనుతో దోశను తాత్కాలికంగా మార్చుకున్నారు. కానీ టోకెనుకు స్వతహాగా పెన్నులాగా రాసే గుణం గానీ, దోశలా ఆకలి తీర్చే లక్షణం గానీ లేవు. పరోక్షంగా మార్చుకోబడినవి మాత్రం పెన్నులు, దోశలు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో రకరకాల టిఫిన్లకు రకరకాల రంగుల టోకెన్లు పెట్టుకున్నట్టుగానే, వివిధ దేశాల్లో ఉన్న ఉత్పత్తుల్ని, సేవల్ని పరస్పరం వినిమయం చేసుకొనేందుకు వీలుగా కరెన్సీ అనే టోకెన్లను వివిధ డినామినేషన్లలో తయారు చేస్తారు. దోశల సంఖ్యనుబట్టి, పెన్నుల సంఖ్యను బట్టి టోకెన్ల సంఖ్య అవసరం అవుతుంది. అంతేగానీ టోకెన్లు ఎక్కువున్నంత మాత్రాన దోశలు, పెన్నులూ ఎక్కువ కావు కదా!

కరెన్సీని చట్ట బద్ధంగా రిజర్వు బ్యాంకు అధీనంలో ముద్రిస్తారు. చట్ట వ్యతిరేకంగా నేరస్తులు దొంగ నోట్లను ముద్రిస్తారు. విలువలేని దొంగ కరెన్సీకూడా సమాజంలో చలామణీ అవడం వల్ల కృత్రిమంగా ధరలు పెరుగుతాయి. పేదవాళ్లకు కష్టాలు అధికమవుతాయి. జాతీయ ఉత్పత్తికి అనుగుణంగా కరెన్సీ చలామణీ అయ్యేలా ముద్రిస్తారు.
=============================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కృష్ణద్రవ్యం అంటే ఏంటి?, Black Mater-what is it?





కృష్ణద్రవ్యం అంటే ఏంటి?

ప్రశ్న: కృష్ణ ద్రవ్యము (Dark Matter) అంటే ఏమిటి?

జవాబు: ఈ విశాల విశ్వంలో, బ్రహ్మాండాలను (గెలాక్సీలను) ఒకటిగా ఉంచడానికి, అవి గుంపులుగా కదలడానికి ఎంత ద్రవ్యరాశి (Matter)కావాలో గణనలు చేయడం ద్వారా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. కానీ వారు గమనించిన ద్రవ్యం, విశ్వంలో ఉన్న ద్రవ్యంలో 4 శాతం మాత్రమే. కాబట్టి, ఆ కనిపించని, వెలుగునీయని ద్రవ్యాన్ని డార్క్‌మేటర్‌ (కృష్ణ ద్రవ్యము) అంటారు. ఈ ద్రవ్యము నల్లని మేఘాలు, ధూళి లేక కాలం తీరిన నక్షత్రాల (Dead Stars) రూపంలో ఉందనుకోవడం సరికాదు.

అతి నల్లని ద్రవ్యాన్ని కనుగొనే శాస్త్ర పరికరాలున్నప్పటకీ, ఈ కృష్ణ ద్రవ్యాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహా విస్ఫొటనం (బిగ్‌ బ్యాంగ్‌) తర్వాత జరిగిన కేంద్రక చర్యల (Nuclear reaction) ఆధారంగా విశ్వంలో ఎంత ద్రవ్యం ఉందనేదాన్ని శాస్త్రజ్ఞులు కచ్చితంగా లెక్కకట్టగలరు. ఈ లెక్కల వల్ల తేలిందేమంటే, ఇప్పుడు విశ్వంలో ఉన్న మొత్తం ప్రోటాన్ల, న్యూట్రాన్ల ద్రవ్యరాశి, మొత్తం విశ్వంలో ఉండాల్సిన ద్రవ్యరాశి కన్నా అతి తక్కువ అని. ఈ తప్పిపోయిన ద్రవ్యాన్వేషణ విశ్వజ్ఞాన శాస్త్రజ్ఞుల (Cosmolodist)ను కణభౌతిక శాస్త్రజ్ఞులను ఒక చోటికి చేర్చింది.

ఈ కృష్ణ ద్రవ్యరచన న్యూట్రాన్లు, న్యూట్రినోలు, పెక్సియన్‌ కణాలతో జరిగి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. కాని వాటి ఉనికిని ఇంతవరకు కనిపెట్టలేదు. కారణం ఈ మూడు రకాల కణాలలో విద్యుదావేశం శూన్యం కాబట్టి, అవి వాటిపై పడే కాంతిని శోషణం (absorb) చేయడం కాని, పరావర్తనం (reflection) చేయడంగాని చేయలేవు. అందువల్లనే ఆ కణాలతో నిర్మితమైన ఆ ద్రవ్యం కనిపించదు. కానీ కృష్ణద్రవ్యం మహా విస్ఫోటన ధాటికి తట్టుకుని విశ్వంలో నిశ్చలంగా ఉంది.
=============================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, January 13, 2010

గ్రీటింగ్ కార్డుల కధ ఏమిటి , Greeing Cards Story




కొత్త సంవత్సరము , పుట్టినరోజు , పెళ్లిరోజు . పండగరోజు లలో స్నేహితులకు , బందువులకు గ్రీటింగ్ కార్డులు ఇచ్చి పుచ్చుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే . మరి ఇలా కార్డులు ఇచ్చుపుచ్చుకోవడం ఎప్పుడు మొదలైనది ? .. సుమారు 600 ఏళ్ళ క్రితము .. 1400 శతాబ్దములో చేతితో కాగితాల పై బొమ్మలు వేసి వాటిని యూరఫ్ లో ఒకరికొకరు ఇచ్చుకునే వారనడానికి ఆధారాలు ఉన్నాయట . అప్పటి గ్రీటింగ్ కార్డులు ఇప్పటికీ లండన్ మ్యుజేయం లో ఉన్నాయట. వీటిని ఎంతోమంది ప్రతి ఏటా సందర్శిస్తున్నారు . అచ్చుయంత్రం కనిపెట్టాక వీటి హంగామా పెరిగింది . మొదటగా జర్మనీ వాళ్ళు ప్రత్యేక సందర్భాల కోసం గ్రీటింగ్ కార్డులను ప్రింట్ చేయడం మొదలు పెట్టేరు . ఆ తర్వాత దేశదేశాల్లో గ్రీటింగ్ కార్డులు ముద్రణ , అమ్మకాలు విపరీతం గా పెరిగాయి .

కార్డులు కన్నా ముందే ఈజిప్టు లో ఈ సంప్రదాయం మొదలైనదని అంటారు . ఈజిప్తియన్లు చెట్ల బెరడులపై శుభాకాక్షలు రాసి ఇష్టమైన వారికి ఇచ్చుకునే వారని చెబుతారు . కాగితం కనుగొన్న తరువాత రాతలన్ని దాని మీదకు మారాయన్నమాట . మొత్తం మీద 18 వ శతాబ్దం నుంచి వీటి వాడుక పెరిగిపోయింది . ప్రఖ్యాత చిత్రకారులైన "కేట్ గిరవే " , " వాల్టర్ క్రేన్ " లాంటి వారు రకరకాలైన డిజైన్లలో కార్డులు తయారు చేయించి ముద్రించేవారు . 19 శతాబ్దం వచ్చేసరికి 'మదర్స్ డే ' ఫాదర్స్ డే ' లాంటి ప్రత్యేక దినాలు పెరిగిపోవడం తో ఉత్పత్తి పెరిగింది .

మీకు తెలుసా ?...
  • అమెరికా లో ప్రతి ఏడాది 700 కోట్లు గ్ర్రేటింగ్ కార్డులు అమ్ముడవుతున్నాయి . వీటి విలువ 750 కోట్ల డాలర్లు పైమాటే .
  • బ్రిటన్ లో ఏట 100 కోట్ల పౌండ్ల వ్యాపారము జరుగుతుంది .
  • ఒక మనిషి ఏడాదికి 20 కర్డులైనా అందుకుంటాడని అంచనా .
  • ఏటా ఆన్ లైన్ ద్వారా 50 కోట్ల గ్రీటింగ్ కార్డ్లులు బట్వాడా అవుతున్నాయని అంచనా .
  • బెల్జియం లో అతి చిన్న గ్రీటింగ్ కార్డు ను చేసి రికార్డు కొట్టేసారు .
  • ఆగ్రా లో అతి పెద్ద గ్రీటింగ్ కార్డ్ చేసారు . దాని పొడవు 127 మీటర్లు .
  • ప్రపంచ వ్యాప్తం గా గ్రీటింగ్ కార్డులలో 60 శాతము క్రిస్టమస్ పండుగకే అమ్ముడవుతున్నాయి .

================================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ఈఫిల్ టవర్ సంగతేమిటి , Efil Tower History-about




1052 అడుగుల ఎత్తు దాదాపు 7000 టన్నుల బరువు , 2.5 ఎకరాల విస్తీర్ణము , ఉన్నా ఈఫిల్ టవర్ ప్రపంచం లోనే అత్యున్నత కట్టడాలలో ఒకటి గా పేరుతెచ్చుకున్న ఈఫిల్ టవర్ ఇప్పుడు మరో ఘనతను కుడా పొందింది . తాజమహల్ , చైనాగోడ , స్తాత్యు అఫ్ లిబర్టి , ఇలా పపంచం లో ఉన్న అద్భుత కట్టడాలలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే , అభిమానించే కట్టడం గా పేరుతెచ్చుకుంది .

  • ప్రపంచం మొత్తం మీద పర్యాటకులు టిక్కెట్టు కొనుక్కొని సందర్శించే కట్టడాలలో ఈఫిల్ టవర్ దే మొదటి స్థానము . ప్రారంభమైన 1889 నుంచి ఇంతవరకు మొత్తం 20 కోట్ల మంది సందర్శించారు .
  • ఫ్రాన్సు లోని పారిస్ లో ఉన్న దీన్ని " గుస్తావా ఈఫిల్ " అనే ఇంజినీర్ ఇంర్మించాడు . నిర్మాణానికి రెండు ఏళ్ళ రెండు నెలలు పట్టింది . 1889 మార్చి 31 న పూర్తీ చేసారు .
  • 1930 వరకు ఇదే ప్రపంచం లో ఎత్తైన కట్టడం ,
  • దీని నమూనా కోసం 50 మంది ఇంజినీర్లు 5,300 బొమ్మలు వేశారు .
  • 18,000 విడిభాగాలను ముందుగా రూపొందించి వాటిని కలిపి దీనిని నిర్మించారు .
  • ప్రతి ఏడు ఏళ్లకొకసారి రంగులు వేస్తారు . పూర్తిచేయడానికి సుమారు 18 నెలలు పడుతుంది , 50 టన్నుల రంగు అవసరమవుతుంది .
  • దీనిపై మొత్తం 20,000 విద్యుత్ బుల్బులు అమర్చారు .
  • మూడు అంతస్తులుగా నిర్మించిన దీనిలో రెండు రెస్టారెంట్లు , ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి .
  • దీన్ని పేల్చివేయడానికి 1986 లో ఉగ్రవాదులు బాంబ్ పెట్టేరు ... అదృష్టవశాత్తు అది పేలలేదు .
  • దీంట్లో సందర్శకులకు పైకి తీసుకువెళ్ళే లిప్టులు తిరిగే దురాన్ని లెక్క కడితే ఏటా ౧౦,౦౦,౦౦౦ కిలోమీటర్లు అవుతుంది .
  • ఈఫిల్ టవర్ చివరి నిల్చుని 42 మైళ్ళ దూరం వరకు చుడొచ్చును .
  • దీనిలో మొత్తం 1710 మెట్లు ఉన్నాయి .
  • బలం గా గాలులు వీచితే టవర్ కాస్త ఊగుతుంది . 1999 లో ఒకసారి వీచిన గాలులకు 13 సెంటీమీటర్లు మేర ఊగింది .
  • ఈ టవర్ ను శుబ్రం చేయడానికి 4 టన్నుల సామగ్రి కావాలి . డిటార్జంటలు 400 లీటర్లు అవసరమవుతాయి ,
  • దీని పొడవు వేసవి లో కొలిస్తే 3.25 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది , శీతాకాలం లో 6 అంగుళాలు తక్కువవుతుంది ... ఇనుము వ్యాకోచ , సంకోచాలే ఇందుకు కారణము .
  • దీని నిర్మాణము లో 25, ౦౦,౦౦౦ రివట్లను (Rivits) ఉపయోగించారు .
మూలము : ఈనాడు న్యూస్ పేపర్.(Jan2010)
============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, January 10, 2010

సబ్బు తో మురికి ఎలా వదులుతుంది?,Soap cleaning Dirt -How?


నీళ్ళ తో మాత్రమే చేయి కడుక్కుంటే మురికి వదిలినట్లు అనిపించదు . నీటికున్న తలతన్యత గుణము వల్ల సన్నని దుమ్ము , ధూళి , జిడ్డు వంటివి నీటి పై పొరకు అంటి పెట్టుకుని నిలుస్తాయి . ఇది పాలమీద మీగడ తట్టు తేలుతున్నటు వంటిదే .
ఇటువంటి మురికి నీటి తో వదలదు . . కాని సబ్బుతో కడుగుకున్నపుడు సబ్బులోని రసాయనాలు , నురగ , నీటి పైపోరలోనున్న తతన్యతను తొలగిస్తుంది . కాబట్టి చేతికున్న మలినం నీటిలో పాటుగా జారిపోతుంది .


visit My website > Dr.Seshagirirao - MBBS.

ఉపనిషత్తులు అంటే ఏమిటి?, Upanishats-What and How






హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ఒకప్పుడు మహా ఋషులు , ఋషి పుత్రులు ఒకచోట చేరి ... ఆత్మ అంటే ఏమిటి? అనాత్మ అంటే ఏమిటి? జీవుడు ఎవరు ? జీవుల ఈస్వరుల నడుమ సంబంధం ఎటువంటిది ? చివరికి ఎక్కకడికి పోతాం ? అన్న ప్రశ్నల గురించి చేర్చాలు జరుపగా వచ్చిన జవాబులే ఉపనిషత్తులు .
పూర్వము పోలీసు , న్యాయవవస్థ లేవుకాబట్టి , నీతి , నియమము , మంచి ,చెడు , ధర్మము , అధర్మము , పాపము , పుణ్యము అనే అంశాల పైన న్యాయ తీర్పులన్నీ ఉండేవి ... వాటిని తెలియజేసేవే వేదాలు ... ఉపనిషత్తులు .

ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి

1. సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
2. బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
3. అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
4. ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి.

నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.

10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి.:

  1. ఈశావాస్యోపనిషత్తు
  2. కేనోపనిషత్తు
  3. కఠోపనిషత్తు
  4. ప్రశ్నోపనిషత్తు
  5. ముండకోపనిషత్తు
  6. మాండూక్యోపనిషత్తు
  7. తైత్తిరీయోపనిషత్తు
  8. ఐతరేయోపనిషత్తు
  9. ఛాందోగ్యోపనిషత్తు
  10. బృహదారణ్యకోపనిషత్తు

108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి :

1. ఈశావాస్యోపనిషత్
2. కేసోపనిషత్ 3. కఠోపనిషత్
4. ప్రశ్నోపనిషత్
5. ముండకోపనిషత్
6. మాండూక్యోపనిషత్
7. తైత్తిరీయోపనిషత్
8. ఐతరేయోపనిషత్
9. ఛాందోగ్యోపనిషత్
10. బౄహదారణ్య కోపనిషత్
11. బ్రహ్మోపనిషత్
12. కైవల్యోపనిషత్
13. జాబాలోపనిషత్
14. శ్వేతాశ్వతరోపనిషత్
15. హంసోపనిషత్
16. అరుణికోపనిషత్
17. గర్భోపనిషత్
18. నారాయణోపనిషత్
19. పరమహంసోపనిషత్
20. అమౄతబిందూపనిషత్
21. అమౄతబిందూపనిషత్
22. అథర్వనాదోపనిషత్
23. అథర్వఖోపనిషత్
24. మైత్రాయణ్యుపనిషత్
25. కౌషితకీబ్రాహ్మణోపనిషత్
26. బౄహజ్జాబాలోపనిషత్
27. నౄసిమ్హతాపిన్యుపనిషత్ (పూర్వతాపిని, ఉత్తరతాపిని)
28. కాలాగ్నిరుద్రోపనిషత్
29. మైత్రేయోపనిషత్
30. సుబాలోపనిషత్
31. క్షురికోపనిషత్
32. మంత్రికోపనిషత్
33. సర్వసారోపనిషత్
34. నిరాలంబోపనిషత్
35. శుకరహస్యోపనిషత్
36. వజ్రసూచ్యుపనిషత్
37. తేజోబిందూపనిషత్
38. నాదబిందూపనిషత్
39. ధ్యానబిందూపనిషత్
40. బ్రహ్మవిద్యోపనిషత్
41. యోగతత్వోపనిషత్
42. ఆత్మబోధోపనిషత్
43. నారదపరివ్రాజకోపనిషత్
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్
45. సీతోపనిషత్
46. యోగచూడామణ్యు పనిషత్
47. నిర్వాణోపనిషత్
48. మండల బ్రాహ్మణోపనిషత్
49. దక్షిణామూర్త్యుపనిషత్
50. శరభోపనిషత్
51. స్కందోపనిషత్
52. మహానారాయణోపనిషత్
53. అద్వయతారకోపనిషత్
54. రామరహస్యోపనిషత్
55. రామతాపిన్యుపనిషత్ (పూర్వతాపిన్యుపనిషత్ , ఉత్తరతాపిన్యుపనిషత్)
56. వాసుదేవోపనిషత్
57. ముద్గలోపనిషత్
58. శాండిల్యోపనిషత్
59. పైంగలోపనిషత్
60. భిక్షుకోపనిషత్
61. మహోపనిషత్
62. శారీరకోపనిషత్
63. యోగశిఖోపనిషత్
64. తురీయాతీతోపనిషత్
65. సన్న్యాసోపనిషత్
66. పరమహంసపరివ్రాజకోపనిషత్
67. అక్షమాలికోపనిషత్
68. అవ్యక్తోపనిషత్
69. ఏకాక్షరోపనిషత్ 70. అన్నపూర్ణోపనిషత్
71. సూర్యోపనిషత్
72. అక్ష్యుపనిషత్
73. అధ్యాత్మోపనిషత్
74. కుండికోపనిషత్
75. సావిత్ర్యుపనిషత్
76. ఆత్మోపనిషత్
77. పాశుపతబ్రహ్మోపనిషత్
78. పరబ్రహ్మోపనిషత్
79. అవధూతో పనిషత్
80. త్రిపురతాపిన్యుపనిషత్
81. శ్రీదేవ్యుపనిషత్
82. త్రిపురోఒపనిషత్
83. కఠరుద్రోపనిషత్
84. భావనోపనిషత్
85. రుద్రహౄదయోపనిషత్
86. యోగకుండల్యుపనిషత్
87. భస్మజాబాలోపనిషత్
88. రుద్రాక్షజాబాలోపనిషత్
89. గణపత్యుపనిషత్
90. దర్శనోపనిషత్
91. తారసారోపనిషత్
92. మహావాక్యోపనిషత్
93. పంచబ్రహ్మోపనిషత్
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్
95. గోపాలతాపిన్యుపనిషత్
96. కౄష్ణోపనిషత్
97. యాజ్ణ్జవల్క్యోపనిషత్
98. వరాహోపనిషత్
99. శాట్యాయనీయొపనిషత్
100. హయగ్రీవోపనిషత్
101. దత్తత్రేయోపనిషత్
102. గారుడోపనిషత్
103. కలిసంతారణోపనిషత్
104. బాల్యుపనిషత్
105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్
106. సరస్వతీ రహస్యోపనిషత్
107. బహ్వౄచోపనిషత్
108. ముక్తికోపనిషత్

======================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, January 02, 2010

క్యాలెండర్ కదా ఏమిటి? , Story of Calendar




ఈనాటి క్యాలండర్ కి తోలిరుపాలు ఏవని చూస్తే ముఖ్యము గా రోమన్ , ఈజిప్టు , గ్రేగేరియక్న్ విధానాల గురించి చెప్పుకోవాలి .

రోం సామ్రాజ్యాన్ని పాలించే రోమన్ చక్రవర్తి కాలం లో ఏడాదికి 304 రోజులుగా నిర్ణయించారు . వీటిని పది నెలలు గా విభజించారు . అప్పట్లో మార్చి తో కొత్త ఏడాది ప్రనంభంయ్యేది . ఆ తర్వాత క్రీస్తుపుర్వము ఏడో శతాబ్దము దగ్గరికి వస్తే రోమ్ ని పాలించిన "సుమా పామ్పిలియాస్ " ఏడాదిని 12 నెలలు గా విభజించాడు . రోజుల సంఖ్య ఏడాదికి 354 రోజులు గా చెప్పాడు . అయితే సరిసంఖ్యలు శుభకరం కావనే నమ్మకం తో ఒక రోజును కలిపి ఏడాదికి 355 రోజులు గా నిర్ణయించారు .

క్రీస్తు పూర్వము 153 లో ఏడాది ప్రారంభాన్ని మార్చి నుంచి జనవరికి మార్చారు . కాని చంద్రుడి గమనము , సూర్యుడు గమనము ప్రకారము చుస్తే ఏడాదికి రోజుల లెక్కల్లో తేడాలు ఉండేవి . ఈ గందరగోలాన్ని సవరించడానికి రోమన్ చక్రవర్తి " జూలియస్ సీజర్ " ప్రయత్నించారు . క్రీస్తు పూర్వము 46 లో ఈజిప్టు వెళ్ళిన ఆయన అక్కడ ఏడాది విభజించిన విధానాన్ని తెలుసుకుని రోమ్ లో అమలు చేశాడు . దాని ప్రకారము ఏడాదికి 265.25 రోజులు గా లెక్కగట్టారు . జనవరి , మార్చి , మే , జూలై , ఆగష్టు , అక్టోబర్ , డిసెంబర్ , నెలలకు 31 రోజులుగా ... ఏప్రిల్ , జూన్ , సెప్టెంబర్ , నవంబర్ నెలలకు ౩౦ రోజులుగా ఫిబ్రవరి నెలకి28రోజులుగా నిర్ణయించారు . అయినా పావురోజు మిగిలిపోయింది . . దాన్ని నాలుగేళ్ల కొకసారి ఫిబ్రవరి కి కలపాలనుకున్నారు . (లీపు సంవత్సరమన్నమాట) . ఇదే జూలియస్ క్యాలెండర్ .

అయితే సీజర్ తర్వాత క్యాలన్డర్ల రూపకర్తలు తప్పుగా అర్ధం చేసుకుని ముడేల్లకోసారే ఫిబ్రవరికి ఒకోరుజును కలిపేయడం మొదలెట్టారు . ఇది క్రీస్తుశకము 8 వరకు కొనసాగింది . దేన్నీ గమనించిన అగస్తస్ అనే చక్రవర్తి అంతవరకూ జరిగిన తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్ళకు ఒకసారి ఒకరోను కలిపే పద్ధతిని ఆపించాడు . ఆ పై క్రీస్తుశకము 567 లో తిరిగి కొత్త సంవత్సరాన్ని మార్చి కి మార్చేశారు .

తర్వాత రోజుల్లో లెక్కలో కచ్చితత్వము పెరిగి ఏడాదికి " 365.242199 రోజులు గా గుర్తించారు . ఇందువల ఏడాదికి 11 నిముషాల 14 సెకనులు వంతున తేడా వస్తు క్రీస్తుశకం 1572 మచ్చేసరికి ఏకంగా 10 రోజుల పాటు క్యాలెండర్ లెక్క తప్పింది . దీన్ని " 13 వ పోప్ గ్రెగొరీ " సరిదిద్దించారు . అయిన ఏటా ౦.0078 రోజుల తేడా తప్పలేదు . అందువల్ల ప్రతి 400 ఏళ్ళకి లీపుసంవత్సరాని వదలివేయాలని నిర్ణయించారు . అందువల్లే 400 తో భాగించబడే శతాబ్ది సంవత్సరాలకే తీపు నిబంధన ఉండాలనే సవరింపు వచ్చింది . కాబట్టే 1700 , 1800 , 1900 , మామూలు సంవత్సరాలే .. 2000 మాత్రము లీపుసంవత్సరము .. అలాగే కొత్త సంవత్సరము జనవరి తో ప్రారంభ మవ్వాలని నిర్ణయించారు .

క్రీస్తుశకము 1582 లో అమలులోకి వచ్చిన ఈ గ్రెగోరియన్ క్యాలందరే ఇప్పటి మన క్యాలెండర్ కి నాంది .

==================================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.