Saturday, June 27, 2009

నాణెము నీళ్ళలో వేస్తె పెద్దదవుతుందా?,Coin appears bigger in water why?




నీళ్ళలో పూర్తీ గా మునిగి ఉన్న రూపాయి నాణెము పెద్దది గా మారినట్లు కనిపిస్తుంది . దీనికి కారణము నాణెము పెద్దది గా కనిపించేలా చేస్తున్న కాంతికిరణం , గాలిలో నుండి నీటిలోకి వెళ్ళినప్పుడు కాంతి వేగం తగ్గి వక్రీభావనానికి గురికవటమే . ఈ వక్రీభవనం వల్ల పాత్ర అడుగున ఉన్న నాణెం కొంచెం పెద్దది గా కనిపిస్తుంది ... అంతే కాని వాస్తవానికి నాణెం తడిసి పెద్దది గా మారటం ఎమాత్రం జరుగదు .

source : స్వాతి వారపత్రిక 03-07-2009

Wednesday, June 24, 2009

పోలిష్ చేస్తే షూ(బూట్) మెరుస్తాదేందుకు ?,


పొలిశ్ చేసిన షూ .-------------------------------- పొలిశ్ చెయ్యని షూ
---------------------------------------------------------------------------------------------------------------
పొలిశ్ చేసిన తర్వాత వేసుకునే షూ , పోలోష్ చెయ్యని షూ కి ఉన్నా తేడా స్కూల్ పిల్ల లందరికి తెలిసినదే .

షూ కి పొలిశ్ తో వచ్చే మెరుపు ఆ షూ నునుపుదనం మీద ఆధారపడుతుంది . షూ తయారీకి వాడేది చర్మ అయినా , ఇతర పదార్దమైనా దాని నిండా చిన్న చిన్న గుంటలు ఉండి గరుకుగా ఉంటుంది . అందువల్ల షూ "డల్ " గా కనిపిస్తుంది .
పొలిశ్ చేసినపుడు మనం వాడే పొలిశ్ పదార్ధం ఆ గుంటలను నింపటం వల్ల చర్మం నునుపుగా తయారై వెలుతురు పడినప్పుడు మెరుస్తూ ఎంతో ఆకర్షణీయం గా కనిపిస్తుంది .

Saturday, June 06, 2009

Butterfly has no skeletal system ?







  • సీతాకోక చిలుకకి అస్థిపంజరం వుండదా ?
అందమైన సీతాకికచిలుకలు మరణించినా వాటి శరీరం , రెక్కలు నిలిచి వుండటం కనిపిస్తుంది . దానికి ప్రధాన కారణం ఆ జీవుల అస్తిపంజరమే . ఎముకలు ఏమాత్రం లేని ఆ జీవుల రూపం బాహ్యం గా ఉండే ఖైటిన్ పొర ద్వార వస్తుంది . ఈ పొర ద్వారానే ఆ జీవులు శ్వాసక్రియ , విసర్జన క్రియ జరిపేందుకు వీలైన రంధ్రాలు ఉంటాయి . ఈ ఖైటిన్ పొర సీతాకోక చిలుక మాదిరిగానే రొయ్యలకు , పీతలకు పెంకుపై వుండి వాటికి రక్షణ కల్పిస్తుంది .

  • ==============================