Sunday, March 15, 2009

వడగండ్లు వచ్చేదేలా?


వడగండ్లు ఎలా ఏర్పడతాయి ? అవి వర్షాకాలం వానల్లో కనిపించవేమి?
సాధారణం గా తుఫాను పరిస్థితి లున్నప్పుడే వడగండ్లు కురుస్తాయి . వేసవి కాలం లో ఎండల వలన సముద్రపు నీరు ఆవిరై మేఘాలు గా మారుతాయి . ఇవి తిరుగాడే వాతావరణ పొరలో ఉష్ణోగ్రత దాదాపు సున్నా డిగ్రీల సెంటిగ్రేడు వరకు ఉంటుంది . పై ప్రాంతం లో ఉష్ణోగ్రత ఇంకా తక్కువగా మైనస్ డిగ్రీలలో ఉంటుంది . ఇలాంటి సమయాల్లో వేగంగా వీచే తుపనుగాలులు మేఘాలను వాతావరణం లో పై పొరకు నేట్టివేస్తాయి . అక్కడ ఉష్ణోగ్రత చాలతక్కువగా ఉండడం వల్ల మేఘాల్లోని నీటి బిందువులు ఘనేభవించి వడగండ్లుగా మారుతాయి . ఇవి తమ చుట్టుప్రక్కల ఉండే నీటి బిందువుల్ని , సూక్శ్మ మంచు బిందువులను కలిపేసుకుని క్రమేణా భారాన్ని పెంచుకుంటాయి. చివరికి వీటిపై పనిచేసే భూమ్యాకర్షణ బలము అక్కడి గాలుల నిరోధక బలం కన్నా ఎక్కువ కాగానే అవి స్వేశ్చేగా భూమి మీదకు కురుస్తాయి .
వానాకాలము లో భూమి వాతావరణ పొరల్లో ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఎక్కువగా ఉండవు కాబట్టి తక్కువ ఎత్తులోనే మేఘాల్లోని నీటి ఆవిరి బిందువులుగా మారి వర్షంలా కురవడం వల్ల వడగండ్లు ఏర్పడవు .

Thursday, March 12, 2009

కొత్త తువ్వాలు నీరు పిల్చదెన్దుకు ?


స్నానం చేసిన తరువాత కొత్త taval తో తుడుచు కుంటే ఒంటిమీద ఉన్నా నీరు అలా నిలిచి ఉన్నట్లే ఉంటుంది .. . అదే taval ఒకటి ,రెండు రోజులు ఉపయోగించిన తర్వాత ఇక నేమ్మిది గా నీరు పీల్చు కోవడం మొదలు పెట్టి హాయిగా వాడుకోగాలుగుతాం ,... దీనికి కారణం

ఒక టవల్ గాని మరేదైనా గుడ్డ గాని తయారీ సమయం లో దానిమీద రసాయనాలు ... బట్ట కొత్తదిగాను రంగులు బాగా అద్దుకుని ఆకర్షణీయం గా కనిపించేందుకు వాడతారు . ఈ రసాయనాలు ఉన్నంత వరకు అవి ఒక పోరా గా ఏర్పడి నీటిని పీల్చ నివ్వవు . ఒకటి , రెండు సార్లు టవల్ నీళ్ళలో తడపడం వలన రసాయనాల పొర పోయి నీరు పీల్చుకునే గుణము వస్తుంది .

Sunday, March 08, 2009

ట్యూబ్లైట్లు ఎక్కువ కాంతినిస్తాయి ఎందుకని?,TubeLight gives more light..Why?

  • ఫిలమెంట్ బల్బు కన్నా ట్యూబ్ లైట్లు ఎక్కువ కాంతినిస్తాయి ఎందుకని?
  • TubeLight gives more light than filment Bulb..Why?


ఒకే సామర్ధ్యం ఉండే ఫిలమెంట్ బల్బుల కన్నా మెర్క్యురి లేదా సోడియం వాయువులు నింపిన ట్యూబ్ లైట్లు ఎక్కుమ కాంతిని అందిస్తాయి . ఏదైనా పదార్ధం గుండా విధ్యుత్ ప్రవహించినపుడు ఉష్ణ శక్తి , కాంతి శక్తి వెలువడతాయి . ఫిలమెంట్ బల్బు లో విద్యుత్ ఒక సన్నని' టంగ స్టన్ ' తీగ ద్వార ప్రవహించినపుడు ఎక్కువ కాంతి ఉత్పన్నమవుతున్నా , కొంత శక్తి ఉష్ణము గా మారి వృదా అవుతుంది . ఫిలమెంట్ ఉపరితల వైశాల్యము , పొడవుల పై కాంతి శక్తి ఆధారపడి ఉంటుంది .

వాయువులు నింపి ఉండే ట్యూబ్ లైట్ల లో ఎలేక్త్రాన్లు రుణధ్రువము నుండి ధనద్రువానికి ప్రవహిస్తాయి .ఈ వాయువుల అణువులు విద్యుద్వాహ కాలు(conductors) కాబట్టి వాటి గుండా పయనించే ఎలేక్ట్రోన్స్ కాంతి ని వెలువరిస్తాయి . ఈ ప్రక్రియలో ఉష్ణ శక్తి వెలువడే ప్రశ్నే ఉండదు . పైగా కాంతి వెలువడే ప్రదేశపు ఘనపరిమాణము కుడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్యూబ్ లైట్ ... ఫిలమెంట్ బల్బు కన్నా ప్రకాశవంతం గా వెలుగుతాది .

  • ==========================
Visit my website : Dr.Seshagirirao.com

కారు చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి ఏమిటి?, Car wheels appears Running back Why?

  • ప్రశ్న: కారు, బస్సు వేగంగా వెళ్తునప్పుడు చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఎందుకు?



సినిమాల్లో కార్లు వేగంగా వెళ్ళే దృశ్యం చూస్తున్నపుడు , కారు చక్రాలు మొదట్లో ఒక దిశలో తిరిగి మల్లి వెనక్కు తరిగినట్లు కనిపిస్తాయి . ఎందువల్ల ?
కారణం ... మన దృష్టి పై కాంతి ప్రదర్చించే ఒక భ్రమ . కారు చక్రాలు తిరుగుతున్నప్పుడు ఆ భ్రమనానికి కొంత పౌన:పుణ్యం (frequency) ఉంటుంది . భ్రమణం/పౌన:పుణ్యం అంటే ... ఒక సెకనుకు కారు చక్రాలు ఎన్ని భ్రమనాలు (turns) చేస్తున్నాయనే సంఖ్య . .. ప్రోజక్తర్ లో రీలు వేగంగా తిరగడం వల్ల తేరా మీద ఒక దాని తర్వాత ఇఒకటిగా నిశ్చల చిత్రాలు చక చక మారి మనకు దృశ్యం కదులు టున్న భ్రమ కలుగుతుంది . ఆ విదంగా సినిమా తేరా మీద పడే ఫిల్మ్ ప్రతిబింబలకు కుడా పౌన:పుణ్యం ఉంటుందన్నమాట . అంటే తెరపై సెకనుకు ఎన్ని చిత్రాలు పడుతున్నయనే (విక్షేపం )సంఖ్యే అది .
మాములుగా సినిమా తెరపై సెకనుకు 24 ఫిల్మ్లు విక్షేపం(appear) అవుతాయి . ఫిల్మ్ లోని Car చక్రాల భ్రమణాలు సెకనుకు 24 కన్నా తక్కువ ఉంటే Car చక్రాలు వెనుకకు తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది . Car బయల్దేరినపుడు దాని వేగం తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా కనబడుతుంది .Car చక్రాల భ్రమణ పౌ న: పుణ్యం సరగ్గా 24 అయితే చక్రాలు తిరగ కుండా నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తాయి . కారు వేగం ఎక్కువయ్యే కొలదీ చక్రాలు తిరిగే frequency 24 కంటే ఎక్కువవడం వల్ల అవి దిశను మార్చి ముందుకు తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తాయి . అంటే కారు చక్రాలు మొదట్లో వెనక్కు తిరిగి తర్వాత కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉంది అ తర్వాత ముందుకు తితుగుతున్నట్లు అనిపిస్తుంది .
పోన్:పుణ్యాల తేడాల వల్ల కలిగే ఈ వింత దృశ్య ఫలితాన్ని భౌతిక శాస్త్రం లో " Stroboscopic effect " అంటారు .


  • ================================
Visit my website : Dr.seshagirirao.com

Saturday, March 07, 2009

మంగు (ముఖము పై నల్ల మచ్చలు)ఎందుకు వస్తుంది?,Why do we get Mangu (Hyperpigmentation)?


ఏమిటి :
  • మంగు నే ' నల్ల శోబి ' , నల్ల మచ్చలు అంటారు . ఇవి శరీరం అంతటా వచ్చినా ముఖము పైనే స్పష్టము గాకనిపిస్తాయి . ఇవి ఎలాంటి నొప్పిని , భాదను కలిగించవు కాని మానసికంగా ఆ వ్యక్తు లను స్థిమితం గావుండనివ్వవు .
ఎందుకు వస్తాయి :
  • మన శరీరం లో చర్మ రంగుకు కారణమయ్యే 'మెలనిన్' అనే వర్ణ ద్రవ్యం ఉంటుంది .. దీన్ని మేలనోసైట్ లుతాయారు చేస్తాయి . ఈ కణాలూ చర్మం లేనే కాదు .. జుట్టు , శ్లేష్మపు పొరలు , గోళ్ళు , మెదడు కణజాలం , గుండెకండరాలు , కంటి నిర్మాణము లోను ఉంటాయి . ఎ కారణం చేతనైనా చర్మం లోపల మెలనిన్ ఎక్కువగాతయారైతే .. అది అసాధారణం గా పేరుకు పోయి అది ' హైపర పిగ్ మెంటేషన్ ' కి (మగు కి) దారి తీస్తుంది . నిజానికి ఇది స్వేయరక్షణ కోసం జరిగే చర్య ... అంటే సుర్యకిరనాల్లోని' అతినీలలోహిత 'కిరణాలు (ultraviotetrays) చర్మానికి తాకితే కాన్సెర్ కు కారణము అవుతాయి ... అలా జరుగ కుండా ఉన్దేండు కే .. మనము ఎండలో కివెళ్ళగానే మెలనిన్ స్రవించి ఆకిరణలను అడ్డుకుంటాయి . అ విధంగా ఎండలోనికి వెళ్ళగానే చర్మంనల్లబడుతుంది . కొన్ని కారణాలు వలన ఈ మెలనిన్ అక్కడక్కడ పేరుకు పోయి మచ్చలు గా ఏర్పడతాయి .
కారణాలు :
  • అతిగా ఎండా , జీవ క్రియ లో తేడాలు , హార్మోన్ల సమస్యలు , జన్యులోపాలు , పోషక ఆహరం లోపం ., కొన్నిలోహాలు , రసాయనాలు , ఔషధాలు , అనుధార్మికత , అధిక ఉస్ణొగ్రత మున్నగునవి .

Thursday, March 05, 2009

౩ జి సెల్ ఫోన్ అంటే ఏమిటి? , What is 3G cell phone ?


౩ జి సెల్ ఫోన్ అంటే ఏమిటి? , What is 3G cell phone ?

సెల్ ఫోన్ వాడకం బాగా పెరిగినది . మొదటిలో సెల్ ఫోన్ లో కెమెరా uన్డేది కాదు . ఇపుడు అన్ని సెల్ ఫోన్ ల లో కెమెరా తో ఎఫ్ .ఎం .రేడియో , ఇంటర్ నెట్ ఫెసిలిటి వుంటున్నాయి . ఈ విదంగా ఒక తరం సెల్ ఫోన్ ల నుండి అభివృద్ది చెంది మరో ఉన్నతమైన రకం గా మార్పు నే సెల్ ఫోన్ జనరేషన్ గా పిలుస్తారు . 1G , 2 G , 3 G , 4 G . లు గా పరిగనిస్తారు . 3 G సెల్ ఫోన్ ల లో వీడియో కెమెరా ఉన్నందున వీడియో లు చూడడానికి , పంపించేందుకు వీలు ఉంటుంది. కెమెరా కన్ను వెనభాగము లో కాకుండా ముందు భాగము లో వుంటే ... అది మీ రూపాన్నే గ్రహించి , మాటల ధ్వని తరంగాల తో పటు , మన రూపాన్ని కూడా విద్యుత్ సంకేతాలు గా మార్చి ప్రసారం చేసి ఎదే సదుపాయం ఉన్న అవతలి ఫోన్ లో మతాల తో మాట్లాడే మన ఫోటో కనిపిస్తుంది .

ముఖ్య మంత్రులు జిల్లా లలో ఉండే కలక్టర్లు తో మాట్లాడే వీడియో కాన్ఫెరెన్స్ ల గురుండి వినే ఉంటారు . ఈ విధానం ఇప్పటికే ఇంటర్ నెట్ , ఐ -గవర్నెన్స్ లోను అమల్లో ఉంది . కంప్యుటర్ మానిటర్ పై ఉండే కెమెరా (దీన్నే వెబ్ కెమెరా అంటారు ) మన బొమ్మలను , మైక్రో ఫోన్ మన మాటల్ని ఇంటర్నెట్ ద్వారా అవతలి వారికి వ్హేరుస్తుండడం వల్లనే ఎక్కడో అమెరికా లో ఉన్నా మనవాళ్ళని చుస్తూ మాట్లాడుకోగాలుగు తున్నాం . ఇది ఇప్పుడు సెల్ ఫోన్ ల కు వచ్చేసింది . 

  • =======================
 డా.శేషగిరిరావు .శ్ర్రీకాకుళం
 

Wednesday, March 04, 2009

ఉసరవిల్లి ఏక కాలములో అన్నివైపులా ఎలా?చూడగలుగు తుంది ?,Chameloen can see in all directions .. How?

ఉసరవిల్లి ఏకకాలం లో అన్ని వైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారము కోసం వెదుకుతూనే , వెనకనుంచి పొంచి ఉన్నా శత్రువును పసిగట్టగలదు. ఇదెలా సాధ్యం?.. దీనికి వళ్ళంతా కళ్లు ఉండవు . మనలాగే రెండే ఉంటాయి . కాని కనుగుడ్డు దేనికదే అటు ఇటు తిరుగు తుంది. ఒక కన్ను పైకి చూస్తుంటే , మరొకటి ఎదురుగా గాని , కిందికి గాని చూస్తూ ఉంటుంది . ఏదైనా ఆహారము , పురుగు దృష్టి లో పడినప్పుడు మాత్రం రెండు కళ్లు దాని మీదే చుపు కేంద్రీకరిస్తాది ..మరో విశేసం .. . ఉసరవిల్లి డి బైనాక్యులర్ విజన్ ! .ఈ చూపుతో లక్ష్యన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణం లా విసురుతుంది . దీనికుందే గుగురుకు కీటకం అటుక్కుపోతుంది. మరుక్షనమ్ నోటిలోకి లాగేసుకుని గుటుక్కున మింగుతుంది.

Monday, March 02, 2009

సముద్రపు నీరు ఉప్పుగా ఎందుకుంటుంది ?, Sea water is saltish .. Why ?


నది -----------------------------------సముద్రము

సముద్రపు నీరు నేడు ఉప్పు గా త్రాగడానికి పనికిరాకుండా ఉన్నప్పటి కి ... అవి కుడా ఆరంభము లో మంచినీరే . భూమి పై నుండి లవణాలతో కూడిన మంచి నీరు -( పి.ఎచ్ 7.0 కంటే తక్కువ ఉన్నటువంటి ) నదుల ద్వారా సముద్రము లో చేరుతుంది .

నీరు ఆవిరి అవగా లవణాలు మిగిలి ... వాటి సాంద్రత పెరుగు తూ .. అనేక లక్షల సంత్సరాల ఈ పక్రియ వల్ల సముద్రపు నీరు ఉప్పుగా మారింది . పి.ఎచ్ 7.0 కంటే ఎక్కువ గా ఉంటుంది . సముద్రపు ఉప్పదనాన్ని "లవనీయత " అంటారు . ఇది వెయ్యి మీ.లీ. నీటి లో 35 గ్రాములుగా ఉంటుంది . లవనీయత ను % అనే సంకేతం తో చూపుతారు .

సముద్రం నీరు ఉప్పనేల?
ప్రశ్న:
సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుందేం?

జవాబు:
ఏ సముద్రంలోని నీరైనా ఉప్పగానే ఉండడానికి కారణం ఆ నీటిలో ఉప్పు ఉన్నందువల్లనే. అయితే ఆ ఉప్పు ఎక్కడిదో చూద్దాం. ఉప్పు నీటిలో కరుగుతుంది కదా. వర్షం నీరు భూమిపై పొరల్లో ఉండే ఉప్పు, ఇతర ఖనిజ లవణాలను నదుల్లోకి మోసుకుపోతుంది. ఆ నదులు వాటిని సముద్రాల్లోకి చేరుస్తాయి. సముద్రాల లోని నీరు సూర్యరశ్మిలోని ఉష్ణశక్తి వలన నీటి ఆవిరిగా మారి, భూమిపై వాతావరణంలో మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలలోని నీరే వర్షించి తిరిగి భూమిపై పారి లవణాలను సముద్రంలోకి చేరుస్తుంది. సముద్రాలలోకి చేరే నీరు తిరిగి ఆవిరి రూపం పొందినా, లవణాలు మాత్రం భాష్పీభవనం చెందలేక సముద్రాల్లోనే పేరుకుపోతుంది. ఈ చక్రక్రమం అనేక కోట్ల సంవత్సరాల నుంచి జరగడం వల్ల సముద్ర జలాల్లో ఉప్పు పరిమాణం నిరంతరంగా పెరుగుతూనే ఉంఉంది. అందువల్లనే ఆ నీరు ఉప్పన.

  • ===============================================
Visit my website - > dr.seshagirirao - MBBS